
VIPLAVA MAHAYUGAM
₹120
In stock · 3 available
PublisherPADALA RAMA RAO
LanguageTelugu
తొలిపలుకు స్వాతంత్రోదయమై రెండు దశాబ్దాలన్నర కావస్తున్నా నేటి వరకూ స్వాతంత్య్ర వీరుల చరిత్ర చాలామందికి తెలియదు. అప్పుడప్పుడు కొద్ది మంది నాయకుల చరిత్రలు మనం చదువుతుంటాం. కాని 1757లో భారత దేశములో ఏర్పడిన బ్రిటీషు రాజ్యాధికారాన్ని ఆనాటి నుండే సవాల్ చేసి ఆ పోరాటంలో తమ జీవితాలనే ఇంధనంగా సమర్పించిన అనేకానేకమంది విప్లవవైతాళికుల గీతికల్ని భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో సమ్మేళనం చేసి రచించబడ్డ సమగ్ర చరిత్రను మనమింతవరకూ చూడలేదు. అందుకే శ్రీ పడాల రచించిన యీ బృహత్తర విప్లవ గ్రంధానికి సింధూర తిలకాన్ని అమితానందంతో పెడుతున్నాను. వర్తమాన భారత దేశానికి యీ గ్రంధమెంతో అమూల్యమైనది. చరిత్రలు వాలమందిరాయవచ్చు. కాని ఆ రచయితకు ఆ చరిత్ర ఎడల గల దృక్పధమేమిటి? అని విచారించాలి. అలా విచారించినప్పుడు యీ గ్రంధరచనలో శ్రీ పడాల ప్రశంసనీయమైన నిష్పాక్షిక విప్లవ దృక్పధాన్ని అవలంబించి, ఎవరి పేరు విన్నంతనే ఆ రోజుల్లో గడ్డిపరకలు విచ్చుకత్తులై నాట్యం చేసాయో ఆ వీరుల చరిత్రను, చరిత్రకోణాల్లో చిక్కుపడిన అనేక రహస్యాలను బయటపెడుతూ నాటి ప్రజా విజృంభణను వాస్తవిక దృష్టితో కొలుస్తూ, ఉద్వేగవంతమైన శైలిలో యీ రచన గావించారు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, అనేక రచనలు గావించి ఆంధ్రలో అనన్య ప్రసిద్ధిబడసి శ్రీ పడాల కలం నుండి యీ ఆత్యద్భుత విప్లవ చరిత్ర బయటకు రావడం ఆంధ్రులంతా గర్వించదగినది. దినదినాభివృద్ధి చెందుతున్న వర్తమాన యువలోకం, యీ దేశ స్వాతంత్ర్యాన్ని సాధించడానికి మన వీరులు ఎన్నెన్ని నెత్తురుటేరుల నీదారో ఎన్నెన్ని అగ్నిగుండాల దూకారో ఆ ఆవేశపూరితమైన చరిత్రను తెలుసుకోవడం అవసరం. ఎన్నెన్ని అపూర్వ త్యాగాలను వారు చేసారని? విచారణ లేకుండా ఎందరెందరు కాల్చి చంపబడ్డారని? దేశభక్తే నేరంగా, ఎందరెందరిని గుత్తులు గుత్తులుగా చెట్లకు కట్టి ఉరితీసారని ? బాలికలు వృద్ధులూ అనే తారతమ్యం లేకుండా యీ స్వాతంత్రమహాయజ్ఞంలో ఎందరు సమిధలుగా బలైపోయారని? ఒక వీరుడు మరణిస్తే మరొక వీరుడు ప్రభవిస్తూ ఒక వీరుని చేతినుండి జారిపోయే విప్లవ కాగడాను మరొక వీరుడు అందుకుంటూ దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణచేస్తూ భాతర వేశానికి ప్రపంచఖ్యాతి తెచ్చి పెట్టిన మన వీరులు చిరస్మరణీయులుగదా? సాధించబడ్డ యీ స్వాతంత్ర్యాన్ని సంరక్షించుకొని, పటిష్టంచేసుకోవడానికి యీ వీరచరిత్ర యువకులనెంతగానో ఉత్తేజపరుస్తుంది. మనిషిని మనిషి దోచుకునే వ్యవస్థను శాశ్వతంగా నిర్మూలించి నవసోషలిస్టు సమాజాన్ని నిర్మించాలనే భగత్సింగ్ గావించిన చరిత్రాత్మకమైన ప్రకటనుందే ఆ వైపుగా