
VIPLAVAM NUNCHI VEDAM DAKA
₹250
In stock · 287 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
-తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత సాహితీమూర్తి డా॥ దాశరథి రంగాచార్య. సాహిత్యంలో ఏ ప్రక్రియలో రచన సాగించినా ఆ ప్రక్రియలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సముపార్జించుకోవడం అరుదుగ జరిగే విషయం. బాల సాహిత్యం నుంచి వేదసాహిత్యం వరకు తెలుగు సాహిత్యాన్ని పరిశీలిస్తే డా॥ దాశరథి రంగాచార్యను స్పృశించకుండా ముందుకు సాగే పరిస్థితి ఉండదు. అంతగా తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన వారు మరొకరు కానరారు. నవలా ప్రక్రియలో “చిల్లరదేవుళ్లు” ఎంత ప్రఖ్యాతి నొందిందో వేరుగా చెప్పనక్కరలేదు. తెలంగాణా జనజీవితానికి ప్రతి బింబంగ నిలవడమే కాకుండా, మాండలిక భాషకు పట్టం కట్టిన నవల. భాషకు జవం జీవం మాండలికం అని చిల్లరదేవుళ్లు నవలద్వారా చాటి చెప్పి ఆ తరువాత మాండలిక భాషలో నవలలు వ్రాయడానికి రచయితలకు ప్రేరకులైనారు. 1975లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు విదేశీ ప్రతినిధులకు “చిల్లర దేవుళ" నవలను నాటి విద్యా మంత్రి, మా నాన్నగారు శ్రీ మండలి వెంకట కృష్ణరావు బహూకరించడం నాకు బాగా గుర్తు. నేను కూడా అప్పుడే చిల్లరదేవుళ్లు నవల చదివాను. నాకు దాశరథి రంగాచార్యగారితో వ్యక్తిగత పరిచయం తక్కువ. కానీ వారిసోదరులు డా|| దాశరథి కృష్ణమాచార్య గారితో ఆత్మీయమైన అనుబంధం ఉండేది. ఈ విషయం రంగాచార్యగారికి తెలుసు. ఇంతింతై వటుడింతై అన్నట్లు దాశరథి రంగాచార్య తెలుగు సాహిత్యంలో