
VIRAT - PONUGOTI KRISHNAREDDY
₹65
In stock · 15 available
PublisherNAVODAYA BOOK HOUSE
LanguageTelugu
నిరాట్ స్తెఫాన్ త్స్వైక్ ప్రపంచ ప్రసిద్ధ రచయితల్లో ఒకరు. కథకుడుగా, వ్యాసకర్తగా, నాటక రచయితగా, కవిగా సాహిత్యంలో ఆయన స్థానం చిరస్మరణీయమైంది. సుమారు 40 భాషల్లోకి 'విరాట్' అనువదించబడింది. కొన్ని లక్షల ప్రతులు అమ్ముడుపోయాయి. స్తెఫాన్ త్స్వైక్ 1915–16 ప్రాంతాల్లో భారతదేశానికి వచ్చారు. భారతీయ తత్వశాస్త్రం అంటే ఆయనకు చాలా ఇష్టం. మన వేదాల్ని, ఉపనిషత్తుల్ని, పురాణాల్ని, భగవద్గీతని అధ్యయనం చేశారు. స్తెఫాన్ త్స్వైక్ 1881 నవంబర్ 28న వియన్నా (ఆస్ట్రియా)లో జన్మించారు. ఆస్ట్రియా, ఫ్రాన్స్, జర్మనీలలో విద్యాభ్యాసం చేశారు. కీర్తికాంక్ష ఏ మాత్రం లేని నిరాడంబర వ్యక్తి. గొప్ప ఆత్మాభిమాని, పదవులకు, బిరుదులకు, అధ్యక్షతలకు, సభ్యత్వాలకు, సన్మానాలకు జీవితాంతం చాలా దూరంగా ఉన్నారు. ఆయన ‘యూదు' కావడం వల్ల నాజీల నిరంకుశత్వానికి, అణచివేతకు గురైనారు. నాజీ పోలీసులు ఈయన పుస్తకాల్ని వెతికి వెతికి తగలబెట్టా రు. అక్కడ నుంచి తప్పించుకుని భార్యతో సహా మొదట ఇంగ్లండు, తరువాత బ్రెజిలు పారిపోయారు. చివరికి 1942 ఫిబ్రవరి 22న తన 61వ ఏట భార్యతోపాటు ఆత్మహత్య చేసుకున్నారు. త్స్వైక్ రచనల్లో 'విరాట్' అపూర్వ కళాఖండం.