
VISALAAKSHI KATHALU -BAHUMATHI PONDINA KATHALU
₹200
In stock · 1 available
PublisherETHAKOTA SUBBARAO
LanguageTelugu
పరిహారం సుబ్బయ్య ముసునూరి పం డగొచ్చేస్తందిరా పకీరా! పదివేలన్నా పెట్టి పిల్లకు వస్తువు సేయించకపోతే ఊరుకోనంటన్నాడు మీ అల్లుడని కూతురు నెల ముందే ఫోన్ చేసింది. ఇక్కడ చూస్తేనేమో ఎంత సంపాదించినా జొలాబొటిగా బతకడానికే సరిపోతుంది. ఏంటోరా... ఏంజేయాలో అర్ధం _వడంలేదు." పెట్రోమాక్స్ లైటుకు గాలి కొడుతూ అన్నాడు అచ్చాలు. "ఔను బాబయ్. ఏట ఇదివరకలా లేదు. మా సెల్లె పెళ్ళి చేసాం కదా. పండక్కి తీసుకొచ్చి ఆళ్ళిద్దరికి బట్టలు పెట్టాలంట. మనం తొడుక్కునే కుక్కనాలిక గుడ్డలు పెట్టలేం. బజారుకు తీసికెళ్ళి కావలసినయ్ కొని పెట్టాలంటే ఎంతవుద్దో ఏమో. తెలుసుకుంటేనే బేజారయి పోతుంది." టార్చిలైటులో పాతబేటరీలు తీసేసి కొత్తవి వేస్తూ అన్నాడు ఏసేబు. "అన్నింటికి కరువొచ్చినట్టే ఈ ఏటకీ కరవొచ్చేసినట్టున్నది. అర్ధరాత్రి మద్దెల దరువులా అంతా ముసుగు తన్ని తొంగుంటే మనం మాత్రం కొరివిదయ్యాల్లే రాత్రిళ్లు తిరుగుతున్నాం. కానీ ఏం నాబం. అటు ఆకుకు అందదు ఇటు పోకకు అందదన్నట్టుంది బతుకు." గోనే బస్తాలను చుట్టబెడుతూ అన్నాడు గోవిందు. "ఓరి బాబు అచ్చాలు. కూటి కోసం కోటి ఇద్దెలు. ఎవడికి సీతనయింది అడుసేత్తాడు. మనం ఇదిగో ఈ దారి తొక్కాం. ఇప్పుడంటే మన పని కొంచం విశాలాక్షి కథలు