VISALAAKSHI KATHALU - NOVEMBER 2021 DEEPAVALI PRATYEKA SANCHIKA by ETHAKOTA SUBBARAO Telugu book cover

VISALAAKSHI KATHALU - NOVEMBER 2021 DEEPAVALI PRATYEKA SANCHIKA

by ETHAKOTA SUBBARAO

₹200
In stock · 1 available
PublisherETHAKOTA SUBBARAO
LanguageTelugu
వరశాపం బి. నర్సన్ అదో పల్లెటూరు. అందులో కొత్తగా తెరిచిన బ్యాంకు. మరో గట్టి ఇల్లు దొరకక ఊరు పెద్ద పెద్ద బాపన్న ఇంట్లోనే దాన్ని ఆరంభించారు. ఊరూరూ తిరిగి ఆడవారిని ఒప్పించి పది మందికి ఓ గ్రూప్ చొప్పున మహిళా పొదుపు సంఘాల ఖాతాలను తెరిపిస్తున్నాడు మేనేజర్ సుందర్రాజు. బ్యాంకుకు ఇలా వచ్చి అలా ఊర్లలోకి వెళ్లే సుందర్రాజు ఈ రోజు ఓపిక లేక సీట్లోనే కూచున్నాడు. తన సీటుకు ఎదురుగా ఆవైపు ఉన్న అరుగుపై టక టక చప్పుడు వినవచ్చి తల తిప్పి చూశాడు. చంకలో కర్ర ఆధారంగా ఇంట్లోంచి నడుస్తూ ఒక అమ్మాయి వచ్చి ఎదురుగా ఉన్న గది తలుపు తెరచి లోపలికెళ్ళింది. తలుపు పక్కన కిటికీకి పోస్టాఫీస్ అని బోర్డు తగిలించి ఉంది. లోపల నుంచి ఆమె కిటికీ తెరవగానే చక్కగా సుందర్రాజు కనబడేసరికి కొంచెం పక్కకు జరిగి కూచుంది. సుందర్రాజు వంగి చూస్తే తప్ప కనబడదు. అప్రయత్నంగా వంగి ఆమెను చూసిన సుందర్రాజు మళ్ళీ సర్దుకొని కూచున్నాడు. కనబడకున్నా చూసిన ఆమె రూపు ఆయన కళ్ళల్లోనే ఉంది. వయసు పాతిక దాటి ఉండొచ్చు. రంగు చామనఛాయ అయినా చక్కని వర్చస్సు. పోతపోసిన పల్లె అందంలా ఉంది. ఉత్తరాల సంచి తీసుకోని ఒకాయన ఆ గదిలోకి వెళ్ళాడు. కొద్దిసేపటికి ఉత్తరాలు చేతిలోపట్టుకొని ఆయన బయటికి వెళ్ళిపోయాడు. పని పడితే మళ్ళీ రావచ్చన్నట్లు తలుపులు దగ్గరేసి ఇంట్లోకి వెళ్ళింది. పల్లెటూరి పోస్ట్ మాష్టారన్నమాట. మరి బాపన్న