
VISALAANDHRAMU
₹250
In stock · 54 available
PublisherMODUGULA RAVIKRISHNA
LanguageTelugu
శ్రీ రావు వేంకట మహీపతి | సూర్యారావు బహద్దరు గారు సాయంకాలం నాలుగు గంటలయింది. మహారాజావారు ధోవతిని, ఆఫ్ ఆరమ్ చొక్కాను ధరించి కూర్చున్నారు. ఆంధ్రదేశ సేవావిధానానికంతకు కర్తయైన ఆ సేవా ధురంధరుని, నవనవాదర్శ ప్రేరితుడైన ఆ మానవోత్తముని చూడ్డంతోనే నాకు ఒక విధమైన పుద్రేకం కలిగి, నా సంభాషణ తెలుగులోనే అయినప్పటికీ, కొంచెం తొట్రుపాటు పుట్టింది. అంతట మహారాజావారు "నాయుడుగారికీ నాకూ భేదం యేముంది? వారితో మాట్లాడినట్టుగానే నాతోనూ మాట్లాడండి. అంతా వొక్కటే" అన్నారు. ఈ మాటలు మహారాజావారి అంతర్యాన్ని వ్యక్తపరచడమే కాదు, అవి యిప్పటికిన్నీ నా చెవిలో మ్రోగుతూనే వున్నవి. ముప్పయి యేండ్ల క్రిందట కాబోలు, నరసారావుపేటలో కృష్ణా మండల సంఘ సంస్కరణ సభ జరిగింది'. దానికి మహర్షి వేంకటరత్నం నాయుడుగారు ఆధిపత్యం వహించారు. అధ్యక్షులవారు సంఘ సంస్కరణం యొక్క అర్థాన్ని విశదీకరిస్తూ "సంస్కరణం అంటే స్త్రీ పునర్వివాహాలు చేయడం మాత్రమే కాదు నిమ్నజాతీయులకు వసతిగృహాలు, స్త్రీలకు ప్రసన వైద్యాలయాలు, బీదలకు ధర్మశాలలు, కార్మికులకు అనుకూలమైన యేర్పాటులు, అనాథ బాలబాలికలకు శరణాలయాలు స్థాపించడం కూడాను" అని మహోపన్యాసం చేశారు. కాని, ఈ పని చేసేదానికి విద్య, పలుకుబడి, తీరిక గల మనుష్యులు లేక యీ కార్యక్రమం కేవలం 1. 1930 వరకు ఆంధ్రదేశంలో అన్ని జిల్లాలలో సంఘసంస్కరణ సభలు జరిగేవి. వీటిని యేడాదికొకసారి, రెండేళ్లకొకసారి వీలునుబట్టి జరుపుకొనేవారు. మూఢాచారాల, అంధవిశ్వాసాల నిర్మూలన, స్థానిక సమస్యలు, విద్యావ్యాప్తి ప్రధానంగా ఈ సభలలో చర్చనీయాంశాలు. ఇప్పటి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు చాన్నాళ్లు కృష్ణా జిల్లాగానే కలిసి ఉన్నాయి కాబట్టి కృష్ణా జిల్లా సంఘసంస్కరణ సభనేటి గుంటూరు జిల్లాలోని నరసారావుపేటలో జరిగింది. 1892లో మొట్టమొదటి కృష్ణా మండల సభగుంటూరులో జరిగింది. ఇది అఖండ భారతదేశంలో (పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో కలిపి) మొట్టమొదటి మండల సంస్కరణ సభ. నాటి 'మండలం' నేటి 'జిల్లా'కి సమానార్ధకం.