
VISHNUSARMA ENGLISH CHADUVU - VEERA VALLUDU (2 STORIES IN ONE BOOK)
₹250
In stock · 1 available
PublisherSRI VISWANATHA PUBLICATIONS PVT.LTD
LanguageTelugu
మరొక్కమాట ఒకసారి తాతగారు మా నాయనగారితో “నాయనా, శ్రీనాథులవారు శతాధిక గ్రంథకర్త. వాటిలో మనకిపుడెన్ని లభ్యమగుచున్నవో తెలుసునుకదా. ఒక మహాకవి. తన సర్వ జీవితమును ఒకానొక మహా సంకల్పముతో కొనసాగించును. కాబట్టి తత్కవి చేసిన మహా ప్రయత్నము లోకమునందు బ్రతికివుండవలెనంటే, తత్కవి తడనంతరమున కూడ వాటిని పారంపర్యముగా లోకమునకు అందించవలసిన ఆవశ్యకత యెంతైన వున్నదని అన్నారట. ఆ మాటని మా తల్లిఁదండ్రులు కీ.శే. శ్రీమతి బాల వేఙ్కట లక్ష్మి రాజేశ్వరి మరియు శ్రీపావని శాస్త్రి దంపతులు ఆజ్ఞగా ఆపాదించుకొని యితర వృత్తి వ్యాపారాదులలో చొచ్చుకొనిపోవక నిబద్ధతతో కేవలము విశ్వనాథ వారి సాహిత్య సేవకే వారి పూర్తి జీవితమును అంకితముచేసిరి. అదియే వారికి జీవితము, జీవనము. దానికి వారి సంతానమైన మేము ప్రత్యక్ష సాక్ష్యము. యింటిలో జరుగు ప్రతి చిన్న చిన్న వ్యవహారము లందు కూడ తాతగారి దృష్టి తద్విషయములందెట్లు వుండెడిదో విమర్శా పూర్వకముగ వ్యవహరించేవారు, తద్వారా మేము తాతగారిని ప్రత్యక్షముగా చూడకపోయినప్పటికిని మేము తాతగారిని చూడలేదన్న భావన మాకు ఎన్నడును కలుగనే లేదు. 1976లో తాతగారు కాలము చేయునాటికి వారి రచనలలో సగమునకు సగముపై మావద్ద కాపీరైట్స్ లేవు. వాటినన్నింటిని మరల సంపాదించి తిరిగి కొలువునకు చేర్చునప్పటికి పాతిక ముప్పై సంవత్సరముల కాలము పట్టినది. మా తల్లిఁదండ్రుల జీవిత ధ్యేయమును పరంపరగ కొనసాగించుట పితృణముగ, ‘ఋషి వంటి విశ్వనాథ తెలుగున రెండవ నన్నయ్య' అను భక్తి భావనతో వారి సంపూర్ణ సారస్వతమును తెలుగు పాఠకలోకమునకు అందించు ప్రయత్నములో యీ గ్రంథ రాజము. విశ్వనాధ వారివి మొత్తము 118 రచనలు. అందులో 57 నవలలు, అందులో 'వీరహ్లుడు” అను నవల 1935-45 ప్రాంతాల్లో రచింపబడినది. ఇది ఎనిమిదవ ముద్రణ.