
VISWA SOOKTHI DARSHANAM - 125
₹125
In stock · 130 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
నాటి ఆంధ్రప్రభ మొదలు నేటి స్వాతి వరకు వివిధ పత్రికల్లో కథలు, కవితలు, గేయాలు, వ్యాసాలు, సీరియల్స్, ఫీచర్లు వంటి అనేక ప్రక్రియల్లో ప్రచురితమైన రచనలు వెలువరించిన కలం ఆలపాటి. స్థానిక పబ్లిషర్లతో పాటు నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వంటి సంస్థలు సైతం వీరి నవలలని ప్రచురించాయి. ఆకాశవాణి, దూరదర్శన్లలో వీరు రచించిన పాటలు, నాటికలు, నాటకాలు, ప్రసారం అయ్యాయి. ఇంకా అనేక ఇతర ఛానెల్స్‌లో సీరియల్స్‌కి మాటలరచన కూడా చేశారు. అనువాద రంగంలో కూడా ఎనలేని కృషి చేశారు వీరు. కొన్ని రచనలకి అవార్డులు సైతం అందుకున్న ఆలపాటి కలంతో పాటు, గళం ద్వారా కూడా సుపరిచితులు. పలు భాషల్లో ప్రావీణ్యం ఉన్న ఆలపాటి అనుసృజన ప్రక్రియ సాయంతో విరబూయించిన వెలలేని సూక్తులసమాహారం అయిన ఈ విశ్వసూక్తి దర్శనం మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ, పదిలంగా భద్రపర్చుకోవలసిన మంచి పుస్తకం.