VISWA VIKYATHA SASTRAVETTALU BHARATEEYULU - 40 by T.SANTHA BHASKAR Telugu book cover

VISWA VIKYATHA SASTRAVETTALU BHARATEEYULU - 40

by T.SANTHA BHASKAR

₹40
In stock · 1178 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1. జగదీశ్ చంద్రబోస్ మనిషిలాగే మొక్కలకు ప్రాణం ఉందని కష్టసుఖాలకు చలిస్తాయని తన శాస్త్రపరిశోధనల ద్వారా లోకానికి చాటిచెప్పిన మహనీయుడు జగదీశ్ చంద్రబోస్. పరాజయాలే ప్రగతికి సోపానాలని నమ్మే ఇతడు భౌతిక, రసాయన శాస్త్రాలు చదివినా, వృక్షశాస్త్ర పరిశోధనల ద్వారా ప్రపంచానికి తన ఉనికిని చాటి చెప్పాడు. 1858, నవంబర్ 30న ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న మైమెన్సింగ్లో ఓ సంపన్న కుటుంబంలో జన్మించాడు. బాల్యంలోనే రామాయణ, మహాభారతాలను పారాయణం చేశాడు. కలకత్తాలోని సెయింట్ జూనియర్ పాఠశాలలో చదివాడు. బాల్యంనుండే మొక్కల పెంపకంపై మక్కువ పెంచుకుని రకరకాల మొక్కలను నాటాడు. వాటి బాగోగులు చూస్తూ వాటిపై బాగా అభిమానాన్ని పెంచుకున్నాడు. చీడనుండి మొక్కను కాపాడేందుకు కత్తెరతో కొమ్మను కత్తిరించినపుడు కొమ్మనుండి నీరు కారింది. అప్పుడు మొక్క మనసు బాధ పడుతోందని భావించాడు. మొక్కలకు ప్రాణమున్నది కాబట్టే ఎదుగుతూ, పూలు, కాయలు, పళ్ళు ఇస్తున్నాయని గ్రహించాడు. ప్రాణముండే మొక్కను బాధిస్తే ఏడవదా మరి? అని తలచి మొక్కలపై ఎన్నో పరిశోధనలు చేసేందుకు మానసికంగా ఆనాడే సిద్ధపడ్డాడు. కలకత్తా విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రాన్ని అధ్యయనం చేసి పై చదువుల కోసం ఇంగ్లాండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరాడు. స్వదేశానికి తిరిగి వచ్చాక, కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతికశాస్త్ర ఉపన్యాసకుడిగా చేరాడు. యూరోపియన్లతో కలసి సమానంగా పని చేస్తున్నా, వేతనంలో తేడాలు చూపడంతో బోస్ ఉచితంగానే 3 సంవత్సరాలు బోధించసాగాడు. చివరకు యాజమాన్యం వారే 3 సంవత్సరాల జీతం