VISWA VIKYATHA SASTRAVETTALU VIDESEEYULU - 80 by T.SANTHA BHASKAR Telugu book cover

VISWA VIKYATHA SASTRAVETTALU VIDESEEYULU - 80

by T.SANTHA BHASKAR

₹80
In stock · 266 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1. అరిస్టాటిల్ జీవశాస్త్ర పితామహుడిగా పేరు ప్రఖ్యాతులు పొందిన గ్రీకు శాస్త్రవేత్త అరిస్టాటిల్ థ్రోసు రాష్ట్రంలోని స్టగేరా ప్రాంతంలో క్రీ.పూ. 384వ సం॥లో జన్మించాడు. ఇతని తండ్రి మెసిడోనియా రాజ్య ప్రభువువద్ద ఆస్థాన వైద్యులుగా, ఆప్తమిత్రుడుగా, సలహాదారుడుగా ఉండేవాడు. తండ్రి తెలివితేటలను పుణికిపుచ్చుకున్న అరిస్టాటిల్కు తండ్రి ప్రభావం వలననే జీవశాస్త్రం పట్ల ఆసక్తి కలిగింది. చిన్ననాటినుండే నత్తగుల్లలను, పీతలను అమితశ్రద్దతో పరిశీలించేవాడు. బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. 17సం॥ వయసు వరకు ఏథెన్సు నగరంలోని ప్రముఖ గ్రీకు తత్వవేత్త ప్లాటో నిర్వహిస్తున్న పాఠశాలలో విద్యను అభ్యసించి, ప్లాటోకు ప్రియశిష్యుడయ్యాడు. విద్యాభ్యాసం తర్వాత ఆ పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అక్కడ ఎన్నో రాజనీతి, తత్త్వశాస్త్ర, మత గ్రంథాలను, మానసిక శాస్త్రాలను క్షుణ్ణంగా చదివాడు. పరిశోధనలద్వారా నిరూపించబడే వాస్తవాలే విజ్ఞానశాస్త్ర వికాసానికి దోహదపడతాయని అరిస్టాటిల్ చెప్పేవాడు. గురువు ప్లాటో మరణం తర్వాత అరిస్టాటిల్ హెర్మియస్ రాజ్యానికి వెళ్ళాడు. హెర్మియస్ సోదరిని వివాహం చేసుకున్నాడు. మాసిడోనియా రాజకుమారుడు అలెగ్జాండర్ను రాజు కోరిక పై తన శిష్యుడిగా స్వీకరించాడు. తన శక్తియుక్తులతో ఒక గొప్ప రాజకీయవేత్తగానూ, పరిపాలనాధ్యక్షుడిగానూ అలెగ్జాండర్ను తీర్చిదిద్దాడు. వీరి గురుశిష్య అనుబంధం ఆదర్శప్రాయమై విశ్వమంతా ప్రాచుర్యం పొందింది. ప్రపంచ విజేత అలెగ్జాండర్ గురువుగారి పరిశోధనల కోసం ఎంతోమంది సేవకులను, భారీ నిధులను సమకూర్చిపెట్టాడు.