
VISWADABHIRAMA VINURAVEMA
₹180
In stock · 7 available
PublisherKOTHAPALLI SEETHARAMA
LanguageTelugu
తొలిపలుకు తెలుగు సాహిత్యం, చరిత్ర, సంస్కృతులను అభివృద్ధి పరచి పరంపరను కొనసాగించడం బాధ్యత నెరిగిన మనందరి బాధ్యత. ఆధునికతా వ్యామోహంలోపడి ఆంధ్రుల సంస్కృతి సంప్రదాయాలు చాలా వరకు అంతరించి పోతున్నాయి. అక్షరాలు లేని రోజులలో ప్రజలు సాహిత్యం, చరిత్ర, సంస్కృతులను తమ కుక్షులలో పాటలుగా తదనంతరం ఛందస్సులలో, శిలాశాసనాలలో, లోహఫలకాలలో, తాళపత్రాల్లో, పుస్తకాలలో ఒకదాని తరువాత ఒకదానిలో నిక్షిప్తపరచి పరంపరలను కొనసాగించారు. నేడు ఈ మాధ్యమములన్నీ చరిత్రలోనికి వెళ్లిపోయినవి. మన సాహిత్యం, చరిత్ర, సంస్కృతులను దృశ్య, శబ్ద మాధ్యమాలలో (ఆడియో, వీడియో, ఇంటర్నెట్) భద్రపరచ వలసిన అవసరం ఎంతో వున్నది. తెలుగు భాషకు వరం 'పద్యం'. ఛందోబద్ధమైన పద్యాన్ని కొన్నిసార్లు చదివితేచాలు అవి కంఠతా అయి జీవితాంతం గుర్తుండిపోతాయి. అదే ఛందస్సుయొక్క గొప్పతనము. నేటికీ పద్యములు మనవారి పెదవుల పైన, హృదయంలోన అక్షరమై నిక్షిప్తమై వున్నాయి. విద్యార్థులకు పూర్వం తెలుగునాట అక్షరాలు నేర్చిన తరువాత వేమన శతకాలు కంఠతా పెట్టించే వారు. ఇప్పటి బాలల విద్యావిధానాలలో ఈ పరిస్థితి లేనందున మన భాషా సంస్కృతులను పరిరక్షించుటకు ఈ కార్యక్రమము ఎంతగానో తోడ్పడుతుంది. నేడు పిల్లలను ఆకర్షించి అనందింప చేయుటలో ఏనిమేషన్కు మించిన ప్రక్రియ మరొకటి లేదు. తెలుగులో వేమన పద్యాలకు మించిన నీతి పద్యములు లేవు. వీటి కలయిక పాలూ- తేనెలా, శ్రీ ఘంటసాల 'భగవద్గీత'లా ఇంటింటా వుండవలసిన చక్కని కార్యక్రమమౌతుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ సాహసంగా ఈ కార్యక్రమం చేపట్టాము. ఈకార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగాగల తెలుగు బాలలందరికి చేరుకొనుటకు పెద్దల సహకారంతో అతితక్కువ వెలకు అందిస్తున్నాము. మాతృభాషాభిమానులు, సంఘసేవకులు సంపూర్ణ ప్రోత్సాహం అందించ వలసినదిగా కోరుచున్నాము. మీమితృలకు, బంధువులకు పండుగలలో, పుట్టిన రోజులలో ఈ పుస్తక డి.వి.డి.ని బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించవలసినదిగా కోరుచున్నాము. మాకున్న అరకొర నిధులతో అనేక సమస్యలకు గురియై ఈ కార్యక్రమము పూర్తి చేయగలిగాము. ఇందులో కొన్ని దోషాలుండుట సహజము. తమ సహెదరులుగా భావించి మన్నించమని ప్రార్ధిస్తూయున్నాము. మీకు తెలిసిన సవరణలు తెలియజేస్తే మలి ముద్రణలో సవరిస్తాము. నమస్కారములు.