VISWAKARMEEYA AAYADI LAKSHANAM by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA Telugu book cover

VISWAKARMEEYA AAYADI LAKSHANAM

by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA

₹100
In stock · 10 available
PublisherKANDUKURI VENKATA SATYABRAHMACHARYA
LanguageTelugu
శిల్పకళాభారతి శిల్పం విజ్ఞానానికి నాంది. ఈ సమస్త ప్రపంచమూ శిల్పం వలె సృష్టించబడింది. శిల్పం వల్లనే వృద్ధి చెందుతున్నది. నేడు మనం విజ్ఞానమని దేన్ని పిలుస్తున్నామో దాన్ని శిల్పం అంటారని ఋగ్వేదం చెప్పింది. అథర్వవేదానికి ఉపవేదంగా స్థాపత్యవేదం ప్రఖ్యాతి పొందింది. వేదకాలం నాటికే యజ్ఞశిల్పం, రథశిల్పం, విమానశిల్పం, వాస్తుశిల్పం, ఆయుధ శిల్పం, ప్రాకారశిల్పం వంటి 14 రకాల శిల్పశాఖలు అత్యున్నత స్థితిలో ఉన్నవని వేద మంత్రాల ద్వారా తెలుస్తున్నది. శిల్పం కేవలం లౌకికమైన ఫలాన్నిస్తుందని చాలామంది అభిప్రాయం. కానీ శిల్పంతో దైవత్వాన్ని సాధించవచ్చని ఋగ్వేదంలోని ఋభువులు నిరూపించారు. ప్రాచీన శిల్పరులు శిల్పశాస్త్రాల్ని రచించి మనకందించారు. విశ్వకర్మ ప్రణీతమైన విశ్వకర్మీయమ్, మయముని రచించిన మయమతం, కాశ్యపమహర్షి వ్రాసిన కాశ్యపశిల్పశాస్త్రం, అగస్త్యుని సకలాధికార శిల్పశాస్త్రం, భువనదేవాచార్యుని అపరాజితపృచ్ఛ, మానసారమహర్షి ప్రవచించిన మానసారం, బ్రహ్మప్రణీతమైన బ్రాహ్మీయ చిత్రకర్మశాస్త్రం, సరస్వతీ కృత సారస్వతీయ చిత్రకర్మశాస్త్రం, మండనసూత్రధారుని అనేక శిల్పశాస్త్ర గ్రంథాలు ఉండగా వాటిలో కొన్ని గ్రంథాలు నేడు తెలుగులో అలభ్యం. అటువంటి ప్రాచీన గ్రంథాలను తెలుగులో అనువదించి జనసామాన్యానికి అందించాలనే సదుద్దేశంతో శిల్పకళాభారతి ఆవిర్భవించింది. ప్రాచీన శిల్ప గ్రంథముద్రణ ప్రచారం, దేశం నలుమూలల నుండి అనేక శిల్పశాస్త్ర నిష్ణాతులచే సదస్సులు నిర్వహించడం, సంప్రదాయ శిల్పాచార్యులను సత్కరించడం, సంప్రదాయ శిల్పకళాశాల నిర్వహణ మొదలైనవి శిల్పకళాభారతి లక్ష్యాలు. శిల్పకళాభారతి ద్వారా ఇంతవరకూ మయమతశిల్పశాస్త్రం, వాస్తుపురుషుడు, స్థాపత్యవిద్య, స్థాపకవిద్య, మానసారవాస్తుశాస్త్రం, విశ్వకర్మీయ ఆయాదిలక్షణం వంటి 30 గ్రంథాలు ప్రచురించబడి, విపుల జనాదరణకు నోచుకున్నాయి. త్వరలో విశ్వకర్మీయం, మనుసారం, ఆత్రేయతిలకమ్, ప్రాసాదమండనం, అగస్త్య సకళాధికార శిల్పశాస్త్రం, బ్రాహ్మీయ చిత్రకర్మ శాస్త్రం, సారస్వతీయ చిత్రకర్మశాస్త్రం వంటి శిల్పశాస్త్ర గ్రంథాలను తెలుగులో ముద్రించనుంది. ఆచార్య విశ్వకర్మ కందుకూరి వేంకట గోవిందేశ్వరశర్మ వ్యవస్థాపక అధ్యక్షులు ఆగమవిద్వాన్, శిల్పశాస్త్ర ప్రవీణ కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య సంచాలకులు