VISWALOCHANAM by M.L.KANTHARAO Telugu book cover

VISWALOCHANAM

by M.L.KANTHARAO

₹40
In stock · 5 available
PublisherM.L.KANTHARAO
LanguageTelugu
మూసుకున్న కళ్ళు తెరిపించే కవిలోచనం సమాజంలో మేలుకున్నవాడికి, చుట్టూవున్న పరిస్థితులు అత్యంత బాధాకరమైనది నేటి పరిస్థితి. అందులోనూ రెండు వ్యవస్థల్ని కళ్ళ ముందు చూస్తున్న పెద్దవాళ్ళకి దారుణమైన హృదయవేదన కలిగిస్తుంది ఈనాటి సర్వరంగాల భ్రష్ట సంస్కృతి. అదివరకు ఆధునికతని ఆహ్వానించి, పూర్వాన్ని విమర్శించడం, సాంప్రదాయికమైన లోపాల్నీ, ఘోరాల్నీ సరిదిద్దుకోడానికే నేను యిప్పుడు ఆధునికతని ఆహ్వానించడం ఆత్మహత్యా సదృశమౌతోంది. ఎందుకంటే, ఈనాటి ఆధునికతకి అర్థం మారిపోయింది. ప్రతి అంశంలోనూ అమెరికా అడుగుజాడల్ని ఆరాధించడమే యిప్పటి ఆధునికత. ప్రతి విషయాన్నీ మార్కెట్ దృష్టితో చూడడమే యిప్పటి ఆధునికత, సామాజిక సంస్కృతి, వ్యక్తి స్వేచ్ఛావాదంతో విచ్ఛిన్నం కావడమే యిప్పటి ఆధునికత. మామూలు మనిషినే ఈ ఆధునికత భయపెడుతుంటే, కవిని అసలు నిలవనియ్యడం లేదు. ఎందుకంటే మామూలు మనిషి యిప్పటి భయాన్నే చూస్తాడు. కవి రాబోయే పరిణామాల్ని గ్రహించి తల్లడిల్లిపోతాడు. కవి ఎప్పుడూ పరిస్థితుల పరిణామాన్ని అంచనా వేస్తాడు. భవిష్యత్తు కోసమే అతని ఆందోళన. ఈ ఆందోళన లోంచి రూపుదిద్దుకున్నదే మేళ్ళచెరువు లక్ష్మీకాంతారావు "విశ్వలోచనం". అనేక రంగాల గూర్చిన ఆందోళనను వివరంగా వెలువరించడానికి ఆయన విశాల పరిధిగల దీర్ఘకవితా రూపాన్ని ఎన్నుకున్నారు. అనేక రంగాల పతనాన్ని తీవ్రమైన ఆవేదనతో ఆవిష్కరించారు. అతిముఖ్యమైన అంశాల్లో చాలావరకు ఈ దీర్ఘకవితలో స్థానం పొందాయి. సామాజిక అనుబంధ సంస్కృతి కొన్ని వ్యవస్థల్లో ఉంటుంది. స్థూలంగా చూస్తే ఆసియా సంస్కృతి సామాజికం. ఐరోపా సంస్కృతి వ్యక్తి స్వేచ్ఛా ప్రధానం. సామాజిక సంస్కృతి గల దేశాల్లో సామాజిక నిబంధనలు, కట్టుబాట్లు, నిగ్రహ తత్వము ప్రధానంగా ఉంటై. భారతీయ, ముస్లిమ్ వ్యవస్థలు ఇలాంటివి. ఇవి లేనివి పాశ్చాత్య వ్యవస్థలు. అందుకే హింసాత్మకత, నిగ్రహం గల వ్యవస్థల్లో కనిష్ఠంగా ఉంటుంది. వ్యక్తి స్వేచ్ఛాసమాజాల్లో గరిష్ఠంగా ఉంటుంది. వ్యక్తి స్వేచ్ఛాసమాజంలో వ్యక్తి వ్యవస్థను తయారు చేస్తాడనే సిద్ధాంతం ఉంటుంది కాబట్టి ఏ నేరమైనా వ్యక్తిదే అని చెప్పబడుతుంది. నిగ్రహ ప్రధాన వ్యవస్థలో, వ్యవస్థలో కట్టుబాటు లేకపోవడమే వ్యక్తిని నేరస్థుడిగా చేస్తుందనే సిద్ధాంతం ఉంటుంది కాబట్టి, వ్యవస్థ గూర్చి జాగ్రత్త తీసుకోబడుతుంది.