
VISWAM - GANTA SATYAKUMAR
₹280
In stock · 115 available
PublisherGANTA SATYAKUMAR
LanguageTelugu
విశ్వం ఖగోళ విజ్ఞాన గని సృష్టికి మూలాన్ని సహేతుకంగా వివరించే శాస్త్రం వైజ్ఞానిక శాస్త్రం అయితే ఆలోచనలను అంతరిక్షంలోకి మోసుకెళ్ళి అంతులేని రహస్యాలను ఛేదించే శాస్త్రం ఖగోళ శాస్త్రం. మానవుడు పుట్టి, మెదడు వికసించడం నుంచి ఖగోళ శాస్త్రంపై ఉన్న ఆసక్తి, జిజ్ఞాస ఇంతింత కాదు. ప్రకృతిలో జరిగే పరిణామాలకి కారణాలని శోధిస్తూ మానవుడు ఆకాశం వైపు చూసి పరిష్కార మార్గాలు అన్వేషించేవాడు. ఎండ, వాన, వేడి, నీడ, ఆహరం, చీకటి, కాలం, దేవుడు ఇలా అనేక విషయాలను శోధించడానికి ఆకాశమే ఒక ప్రయోగ శాల. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, ఉల్కలు, నక్షత్రాలు వంటి సెలెస్టియల్ పదార్ధాల గురించి అనేక మంది శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, సాహితీకారులు, జ్యోతిష్కులు, మత ప్రవక్తలు యుగాలుగా శోధిస్తూనే ఉన్నారు. మొదట ఊహా పరికల్పనల నుండి బయలుదేరి, కాల్పనిక గాధలలో నుంచి, టెలిస్కోప్ కనుగొనబడిన తరువాత ఎంతో శోధించిన తరువాత, ఆధునిక విజ్ఞాన శాస్త్రం సహాయంలో ఎన్నో అంతరిక్షనౌకలు వాటిపైకి వెళ్ళి ఎన్నో వాస్తవ అంశాలని వెలికి తెచ్చాయి. వీటి అన్నిటి గురించి ఎంతో విజ్ఞానం అందుబాటులో ఉంది. కాని తెలుగులో చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఈ 'విశ్వం' పుస్తకం ఆ లోపాన్ని తీర్చి పాఠకుల ఆసక్తిని పెంచుతుంది అనడంలో సందేహం లేదు. ఖగోళ శాస్త్రం గురించిన మత బోధనలు, అంధ విశ్వాసాలు జన సామాన్యంలో అంత సులువుగా తొలగిపోవు. నూతన సత్యాలని ప్రజలు అంత త్వరగా అంగీకరించరు కదా. భూమి బల్ల పరుపుగా ఉందని, విశ్వానికి భూమి కేంద్రం అనే సిద్ధాంతాలు చాలా కాలం ప్రచారంలో ఉన్నాయి. విశ్వం సృష్టి గురించి, సూర్య చంద్రులు గురించి ఇంకా అనేక విషయాలు గురించి వివిధ మత పురాణాలు ఎన్నో కథలు చెప్పాయి. అయితే చాలామందికి వాస్తవ సత్యాలు తెలియవు. తెలిసినా అర్ధం కావు. అందుకే ఈ రచయిత విషయాలని చాలా ఓపికగా వివరిస్తారు. వివిధ గ్రహాల గురించి, నక్షత్రాల గురించి, రేఖాంశాల గురించి, అంతరిక్ష పరిశోధన గురించి సమగ్ర వివరణలు అందివ్వడమే కాకుండా వివిధ ప్రాంతాల నుండి గ్రహాలను, వాటి ఉదయ అస్తమయాలని, ఆకాశంలో వాటి స్థానాలని పరిశీలించి డేటాని అందిస్తుంది. ఈ పుస్తకం మొదటి భాగం ఖగోళదర్శనంలో ఖగోళవస్తువులను చూడడానికి అవసరమైన మౌలిక పరిజ్ఞానం గురించి చెబుతుంది. రెండవ భాగం 'గ్రహ లోకం' గ్రహాల గురించి నేటి వరకూ లభ్యమైన సమాచారం గురించి చర్చిస్తుంది. మూడవ భాగంలో విశ్వంలో నక్షత్రాల నిజ స్వరూప లక్షణాలూ, గెలాక్సీలూ,