
VISWAMANTHA BHARATHEEYAM
₹200
In stock · 11 available
PublisherA.PANDARINATH
LanguageTelugu
1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి 150 సంవత్సరాలు భారత్పై పరాయిల జులుం: మనదేశానికి క్రీ.పూ. 2,500 సంవత్సరంనుంచి గొప్ప నాగరికత చరిత్ర ఉంది. సింధూనది లోయలో పట్టణాలు వెలిశాయి. ఆనాటి ప్రజలు విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. ఆరోజులలోనే వారికి వాణిజ్య కార్యకలాపాలు ఉండేవి. వ్యవసాయ సంబంధమైన వ్యాపారం సాగేది. అయితే వాతావరణ మార్పులవల్ల క్రీ.పూ. 1500 సంవత్సరం నాటికి పరిస్థితులన్నీ తారుమారై దేశం పతనం కాసాగింది. అనంతరకాలంలో ఆర్యులు వచ్చి గంగాతీరంలో తిష్టవేశారు. ప్రాచీన మధ్యరాతి యుగంలోనూ భారతదేశంలోని అనేక రాజ్యాలు తరచు పోరాటాలకు దిగుతుండేవి. అందువల్ల రాజ్యాల భౌగోళిక స్వరూపాలు వేగంగా మారిపోయేవి.. క్రీ.శ. 4,5 శతాబ్దాల నాటికి ఉత్తర భారతమంతా గుప్తుల పాలనలోకి వచ్చింది. గుప్తుల పరిపాలనా కాలాన్ని చరిత్రకారులు స్వర్ణయుగంగా అభివర్ణించారు. హిందూ సంస్కృతి, రాజకీయరంగం ఉచ్ఛస్థితికి చేరుకున్న కాలం అది. ఆ తరువాతికాలంలో 500 సంవత్సరాల సమయంలో ఇస్లాం మతం ఇండియా అంతటా వ్యాపించింది. 10, 11 శతాబ్దాలనాటికి తురుష్కులు, ఆఫ్ఘన్లు భారతదేశాన్ని జయించారు. ఢిల్లీలో తొలి ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించారు. 16వ శతాబ్దం తొలినాళ్లలో తిరుగుబాటుదార్లు చెంఘిజాఖానన్ను పరాజితుడిని చేసి మొగల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ సామ్రాజ్యం 200 సంవత్సరాలు కొనసాగింది. ఇక 11-15 శతాబ్దాలలో దక్షిణాపథంలో హిందూ రాజులు చోళులు, విజయనగర రాజులు మంచి వ్యవస్థతో కూడుకున్న పాలనను అందించారు. ఈ సమయంలో హిందూ సంస్కృతిపై ఇస్లాం, ఇస్లాం సంస్కృతిపై హిందూ సంస్కృతి ప్రభావం బలంగా పడింది. 1619లో దక్షిణాసియాలో తొలిసారి బ్రిటీష్వారు తొలిసారిగా పాదం మోపారు. తరువాతి కాలంలో ఈస్టిండియా కంపెనీ మద్రాస్, బొంబాయి, కోల్కత్తా నగరాలలో వ్యాపార కేంద్రాలను శాశ్వత ప్రాతిపదికన ప్రారంభించాయి. అయితే వీటికి స్థానిక రాజుల మద్దతు లభించింది. విశ్వమంతా భారతీయం