VISWAMBHARA by DR.C.NARAYANA REDDY Telugu book cover

VISWAMBHARA

by DR.C.NARAYANA REDDY

₹80
In stock · 822 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ప్రస్తావన ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వాంభర. ఇతివృత్తం – తేడీలతో నిమిత్తంలేనిది, పేరుతో అగత్యం లేని మనిషి కథ. ఈ కథకు నేపథ్యం ప్రకృతి. మనిషి ధరించే వివిధ భూమికలకు మూలాధారత్వపు మనస్తత్వాలు. అలెగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్, బుద్ధుడు, లింకన్, లెనిన్, మార్క్స్, గాంధీ – ఇలా ఇలా ఎన్నెన్నో రూపాలో మనిషికి! కామం, క్రోధం, లోభం, మదం, ఆత్మశోధనం, ప్రకృతిశక్తుల పరిశీలనం – ఇలా ఇలా ఎన్నెన్నో విభిన్న ప్రవృత్తిలో మనిషికి! ఆదిమ మానవుని ఆధునిక నగరవరకు మనిషి చేసిన ప్రయాణాలు ఈ కావ్యంలో ప్రకరణాలు. మనిషి సాధన త్రిముఖం – కళాత్మకం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం. ఈ సాధనలో అడుగడుగునా ఎదురుదెబ్బలు. కృతదేహుడైన మనిషి తిరోగముడు కాలేదు. విశ్వంభర కావ్య రచనకు పూర్వం నాలో గీసుకున్న రేఖాచిత్రమిది. ఈ రేఖాచిత్రాన్ని సుపరిచితంగా రూపాయించడంలో ఆత్రేయుడు డాక్టర్ ఇందిరెంట్ కృష్ణమూర్తి సహకారం సముచితంగా ఉపకరించింది. ఎనల కవితలో ఒక సమగ్ర కావ్యం ద్రావాలనే నా ఆకాంక్ష ఇలా రూపాయించింది. విశ్వమానవేతిహాసాన్ని, అవధిలేని మనిషి మానసకోశాన్ని అవగాహన చేసుకున్న సహృదయులకు ఈ కావ్యం సంతృప్తిని కలిగిస్తుందని నా విశ్వాసం.