
VISWAMBHARA - 70.00
₹70
In stock · 2 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మలి ముద్రణ గురించి కవిగా నా స్థానాన్ని మరింతగా సార్థకం చేసిన కావ్యం విశ్వంభర. * కావ్యం అందుకున్న అవార్డులూ అభినందనలూ ఎన్నెన్నో విశ్వవిద్యాలయాలు ఎం.ఏ. స్థాయిలో దీన్ని పాఠ్యగ్రంథంగా నిర్ణయించాయి. దీనిపై ఎం.ఫిల్, పిహెచ్.డి. పట్టాల కోసం పరిశోధనలు జరిగాయి. ఎందరో ప్రముఖ విమర్శకులు లోతైన వ్యాసాలు రాసి ప్రకటించారు. అంతేకాకుండా ఇతర భాషల్లో కూడా దీని అనువాదాలు వెలువడ్డాయి. హిందీలోకి ఆచార్య భీమ్ సేన్ నిర్మల్, ఇంగ్లీషులోకి డాక్టర్ అమరేంద్ర దీనిని సమర్ధవంతంగా అనువదించారు. కన్నడ, మలయాళ భాషల్లో అనువాదాలు రూపొంది, ముద్రణకు సిద్ధంగా ఉన్నాయి. కొంతకాలం నా పేరు చెబితే కర్పూర వసంతరాయలు కావ్యం గుబాళించేది. ఈ కావ్యం వెలువడిన తరువాత ఎందరో సహృదయులు నన్ను విశ్వంభర కవిగా సంభావించారు. 링 మొదటి ముద్రణ ప్రతులు చెల్లిపోయి దాదాపు దశాబ్దం కావచ్చినా, రెండో ముద్రణ ఎప్పుడెప్పుడని ఎందరెందరో కవితాభిమానులు అడుగుతూనే వున్నా, బహుళ కార్యవ్యాప్తివల్ల పునర్ముద్రణకు పూనుకోలేదు. జ్ఞానపీఠ పురస్కారం లభించడానికి మూలధాతువుగా నిలిచిన విశ్వంభరను మళ్ళీ ముద్రించాలని పట్టుబట్టి ద్వితీయ ముద్రణకు ప్రేరకుడూ కారకుడూ అయిన నా పూర్వవిద్యార్థి, నిరంతర కవితాభిమానీ శ్రీ కె. లింగారెడ్డిగారికి నా ఆశీస్సులు. భావస్ఫోరకమైన ముఖచిత్రం రూపొందించిన వర్ధమాన చిత్రకారుడు చిరంజీవి హరిశంకరూ, అందంగా ముద్రించి ఇచ్చిన పద్మావతీ ఆర్ట్ ప్రింటర్స్ అధినేత శ్రీనివాస కూ నా అభినందనలు.