
VISWANADHA NAVALA DIGDARSANAM - 250
₹250
In stock · 9 available
PublisherNAVARATNA BOOK HOUSE
LanguageTelugu
డాక్టర్ సుసర్ల ఇందిర కీ.శే. డా. సుసర్ల గోపాలశాస్త్రి, శ్రీమతి సుసర్ల సీతాదేవి దంపతుల తృతీయ పుత్రిక. కీ.శే. సుసర్ల సూర్య భగవత్ శంకరశాస్త్రిగారి పౌత్రి, బహుభాషా కోవిదులు, తెలుగు సాహిత్యవేత్త శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారి దౌహిత్రి. 1980లో శ్రీ గుమ్ములూరి రామకృష్ణ ప్రసాద్ (రాంబు) గారితో గృహస్థాశ్రమ ప్రవేశం చేసేరు. ఆంధ్రవిశ్వకళాపరిషత్తు నుండి 1989లో తెలుగులో పిహెచ్.డి. పట్టం సాధించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ హైజిన్ (ఢిల్లీ) నుండి చైల్డ్ ఎడ్యుకేషన్ లో డిప్లమా పొందారు. దాదాపు ఒక పుష్కరం పైన అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్, విశాఖపట్నం శాఖాధిపతిగా తమ సేవ లందించారు. విదేశీయులు తెలుగు అభ్యసించటానికి అనువుగా ఈమె వ్రాసిన 'తేలికైన తెలుగు తేట తెలుగు' అనే గ్రంథాన్ని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారు ప్రచురించారు. అనేకానేక జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వీరి వివిధ ప్రసంగాలు ప్రసారితమైనాయి. సాహిత్యసభల్లో ప్రసంగాలు చేసి సాహిత్యరంగంలో లబ్ధప్రతిష్టులైనారు. బరంపురం విశ్వవిద్యాలయం నుండి డి.లిట్ పరిశోధనా పత్రం సమర్పించారు.