VISWANATHA DHISHNAHELA by DR.GUMMULURI INDIRA Telugu book cover

VISWANATHA DHISHNAHELA

by DR.GUMMULURI INDIRA

₹180
In stock · 8 available
PublisherDR.GUMMULURI INDIRA
LanguageTelugu
నామాట భారతదేశమునందలి ప్రాచీన ఆలంకారికులు కావ్యప్రయోజనములను నిర్దేశించుచు పరనిర్వృతి, జగద్ధితము అను వానిని మౌళిభూతమైనవిగా పేర్కొనిరి. కావ్యప్రక్రియలందు నవలా రచన అధునాతనమైనదని చెప్పవచ్చును. అధునాతన కాలమున దీనికి గల ప్రాచుర్యము మరి ఏ ఇతర ప్రక్రియకు లేదనుట అతిశయోక్తి కాజాలదు. మహా కావ్యమును వ్రాసి ఛందోమయ కవిత్వమునందు తనకు తానే సాటి అనిపించుకొనిన శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు నవలా ప్రక్రియను సైతము చేపట్టి పట్టినది పైడి చేసి వదలినారు. ఒకానొక కాలమున భారతీయాత్మను ప్రతిబింబించు విశ్వనాథవారి రచనలును, ఆ భారతీయాత్మ పైననే దుమారము లేపిన శ్రీ గుడిపాటి వేంకట చలం రచనలును ఆంధ్రదేశమునుఱూతలూగించినవి. విశ్వనాథవారిపై అనేకానేక సిద్ధాంతవ్యాసములు వెలువడినను, ఎన్నియో వెలువడబోవుచున్నను, ఆ కృషి సమగ్రమనజాలము. కారణము ఆ సాహితి పారము లేని మహెూధది. ముప్పదికి పైగా గల వీరి చారిత్రక నవలలలో మతదృక్పథము నెట్లు వెలయించిరో దిఙ్మాత్రముగ చూపుటయే ఈ పరిశోధనావ్యాస సముద్దేశము. మహా మహితాత్ములగు వారి సారస్వత దృక్పథమునందలి లోతుపాతులను తఱచి తఱచి వెలికి తీయుట నావంటి కించిజ్ఞులకు తలకు మించిన పని. ఓపినంత వఱకు అర్థమైనది. "విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరు"ప చేసిన ప్రయత్నమే ఇది. చారిత్రక నవలలలో శ్రీ విశ్వనాథవారు సుప్రతిష్ఠులైన అనేక చరిత్రకారులను, చారిత్రక గ్రంథములను మిక్కిలి సాహసముతో త్రోసిరాజనిరి. మహావైభవోపేత మైన భారతీయ చరిత్ర విదేశీ చరిత్రకారులును, వారి భావదాస్యమును మునిగిన స్వదేశీచరిత్రకారులు కూడ అస్తవ్యస్తముగ రూపొందించుటకు వారి ఆత్మ క్షోభించినది. కనుక భారతీయ గ్రంథములనే ఆధారముగగోని శ్రీ కోటవేంకటా చలం, నడింపల్లి జగన్నాధం వంటి కొందఱి రచనలను చేయూతగా గొని అచ్చమైన యదార్థ చరిత్రగా వారు భావించిన దానినావిష్కరించిరి.