VIVARAM KATHA SAHITYA VYASALU by B.V.N.SWAMY Telugu book cover

VIVARAM KATHA SAHITYA VYASALU

by B.V.N.SWAMY

₹60
In stock · 296 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
చారిత్రక సాక్షిగా తెలుగు కథ అనంతకాలంలో రెండు దశాబ్దాలు చాలా చిన్న పరిధి. సామాజిక జీవనంలో ఈ కాలాన్ని రెండు తరాలుగా లెక్కించవచ్చు. 1980 నుండి నేటి వరకు గల కాలం ప్రజాజీవనంలో అనేక ప్రభావాలను చూపింది. జాతీయ, అంతర్జాతీయ రంగాలలో చోటు చేసుకున్న మార్పులు మారు మూల పల్లెను ఏ విధంగా మార్చాయో నిశితంగా గమనిస్తే తెలుస్తుంది. అభివృద్ధి, ఆర్థిక ప్రగతి, సాంకేతికత, సంప్రదాయం తమతమ పరిధిలో అనేక మార్పులకు గురయ్యాయి. ఈ మార్పుల వల్ల చేకూరిన ఫలాలు సమాజాన్ని ఎంత వరకు ప్రశాంతంగా ఉండనిచ్చాయో పరిశోధించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 1980వ దశకం వచ్చేసరికి మధ్య తరగతి బలపడింది. తెలంగాణ, కళింగ ప్రాంతాల్లో నక్సల్బరీ పోరాట గాలులు బలంగానే ఉన్నాయి. కోస్తాంధ్ర నూతన శతాబ్ది వైపు వేగంగా పరుగులిడుతోంది. ఫ్యాక్షన్, కరువు దాడులతో రాయలసీమ సతమతమవుతోంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ చిత్రపటం రెపరెపలాడుతుండగా నూతన ఆర్థిక సంస్కరణలు వచ్చి చేరాయి. నూతన ఆర్థిక విధానమంటే సరళీకృత ఆర్ధిక విధానం. ప్రభుత్వ నియంత్రణ నుండి అంతర్జాతీయ ద్రవ్యనిధి విధానాలకు అనుగుణంగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రపంచ బ్యాంకు నియంత్రణలోనికి తేవడమే సరళీకృత ఆర్థికవిధానం. ఏ దేశ ఆర్థిక విధానాన్నయినా ప్రపంచానికి తెరచి ఉంచడం ప్రపంచీకరణలోని ఒక పార్శ్వం. భిన్న దేశాల మధ్య సరుకులు, సేవలు స్వేచ్ఛగా వినిమయం కావటానికి స్వేచ్ఛా మార్కెట్ను ఏర్పరచటం దీని లక్షణం. సరళీకరణ విదేశాలకు ద్వారం తెరచింది. దాంతో శీతల పానీయాలు చొరబడ్డాయి. కోకాకోలా లాంటి విదేశీ పానీయాలు తెలుగు దేశంలో సాంస్కృతిక మార్పులకు బీజం వేశాయి. ఈ మార్పుల వల్ల జరిగిన ప్రతి పరిణామాన్నీ తెలుగు కథ రికార్డ్ చేసింది. సరళీకృత ఆర్థిక విధానాల ప్రభావంలో కొట్టుకపోకుండా విలువల కోసం ఘర్షణ పడే స్త్రీని ఓల్గా రాసిన 'కోకాకోలా' కథలో చూడవచ్చు. స్వదేశీ కంపెనీలను, విదేశీ కంపెనీలు ఏ విధంగా అణచివేస్తున్నాయో ఈ కథలో గమనించవచ్చు. ఈ ధోరణిలో వచ్చిందే ఖదీర్ బాబు రాసిన 'పెండెం సోడా సెంటర్' కథ. డా|| బి.వి.ఎన్. స్వామి చారిత్రక సాక్షిగా తెలుగుకథ