
VIVEKA MANDIRAM - ART OF LIVING
₹380
In stock · 357 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126504
VIVEKA MANDIRAM (Art of Living) by Prof. Gujju Chenna Reddy “వివేక మందిరం”లో కథనాయకుడు సురేంద్ర ఆంధ్రా యూనివర్శిటీ ఫిలాసఫి విభాగంలో పిహెచ్.డి. పరిశోధక విద్యార్థి. తండ్రి స్కూల్ టీచర్, తల్లి గృహిణి. కుమారుని ప్రయోజకుని చేయాలని కలలు కంటారు. చదువులో ఎంతో ఎదిగిన అతడు ఉద్యోగం చేయలేదు, సంపాదించలేదు, కాని తల్లిదండ్రుల ఆశలకు మించి ఎదిగాడు. విశాఖజిల్లా చింతపల్లి అటవీ ప్రాంతంలో సురేంద్ర తండ్రి ఉద్యోగరీత్యా ఉపాధ్యాయుడు. అతని విద్యార్థులు గిరి, వాసు గిరిజనులు. ఆకాశాన్ని అంటిన కొండల సోయగంతో పులకించిన ప్రకృతిలో గిరిజనులు స్వేచ్ఛావిహంగాల వలె జీవిస్తూ 'అన్న'లకు ఆశ్రయమిస్తారు. అధునాతన విశాఖనగర జీవితం, అరుదైన పల్లె జీవనం నడుమ సాగిన ఈ "వివేక మందిరం” నవలలో పల్లెపిల్ల ఎంకి నుండి పట్టణంపిల్ల పింకి వరకు కనిపిస్తారు. సరైన జీవన నైపుణ్యాలు సంపాదించిన ఒకవ్యక్తి తనకంటూ ఎవరూ బోధించలేని ఒక వివేకమందిరం సృష్టించుకోగలడు. ఎంతటి ఉద్యోగం, ఎంతటి సంపదైనా సామాన్య జీవితమని భావించిన సురేంద్ర అసామాన్యస్థితికి చేరడమే ఈ “వివేకమందిరం" నవల నేపథ్యం. ★★★ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఉద్యోగాన్ని కాదని ప్రస్తుతం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆంగ్లవిభాగంలో ఆచార్యునిగా సేవలందిస్తున్న గుజ్జు చెన్నారెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి రెండు పిహెచ్.డిలు అందుకున్నారు. 220 పరిశోధనా వ్యాసాలు రాసిన ఆయన గైడెన్స్లోలో పరిశోధక విద్యార్థులతో 45 డాక్టరేట్లు పూర్తిచేయించారు. డిగ్రీ, హైస్కూల్ విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ రాసారు. తెలుగు దినపత్రికలకు కాలమిస్ట్గా, ఆలిండియా రేడియో, దూరదర్శన్లకు ఉపన్యాసకునిగా సేవలందిస్తున్న వీరి మొదటిపుస్తకం “సిక్కోలు కథలు". మొదటి నవల “మరోమహాత్మ,” రెండవ నవల "లండన్ టు అమరావతి,” మూడవ నవల “స్వప్నసాగరం.” కాగా నాల్గవ నవల ఈ "వివేక మందిరం.” ISBN: 978-93-48126-50-4 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 9789348 126504 380/-