VIVEKANANDUNI SAMAJIKA RAJAKEEYA DRUKPADHALU - 35 by K.RAJESWARA RAO Telugu book cover

VIVEKANANDUNI SAMAJIKA RAJAKEEYA DRUKPADHALU - 35

by K.RAJESWARA RAO

₹35
In stock · 3 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
పరిచయం ప్రపంచానికంతకూ స్వామి వివేకానందగా ప్రసిద్ధుడైన నరేంద్రనాథ్ దత్త భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో అత్యంత ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకున్నారు. మామూలుగా చూస్తే ఆయన పసుపు వస్త్రాలు ధరించే సన్యాసి, మత బోధకుడు. వేదాంతవాదం, మరింత స్పష్టంగా చెప్పాలంటే నయావేదాంత వాదమనే తాత్విక మత ఉద్యమ వ్యవస్థాపకుడు, నిర్వాహకుడు. ఆయన రామకృష్ణమిషన్ వ్యవస్థాపకుడు కూడా. ఇది భారతదేశ మంతటా - అలాగే ఆమెరికా, ఇంగ్లాండ్లలో కూడా కేంద్రాలుగల ఉదార సేవాసంస్థ. కానీ ఆయన దృక్పథాలు, బోధనలు భారత జాతీయోద్యమాన్ని, ప్రత్యేకించి విప్లవోద్యమాన్ని, మన జాతీయ జీవితం, సంస్కృతిలోని అనేక అంశాల్ని మహత్తరంగా ప్రభావితం చేశాయి. 20వ శతాబ్ది ప్రారంభకాలం నుండీ అనేక తరాల భారతీయ విప్లవకారులకు స్వామి వివేకానంద రచనలు, నిప్పులు కక్కే ప్రసంగాలు - వెన్నుదన్నుగా నిలిచాయి; ఉత్తేజపరిచాయి; కాకలుదీరేలా చేశాయి. అట్టడుగున పడివున్న లక్షోపలక్షల మంది మూగజీవుల వికాసంకోసం పోరాడమని ఆయన దేశ యువతకు ఇచ్చిన పిలుపు, ఆస్తిపరవర్గాల ప్రత్యేక హక్కుల్ని రద్దుచేసి, జాతీయ సంపదలో తగినంత భాగం శ్రమ జీవులకు ఇవ్వడం అనే సమస్యపై ఆయనకున్న విప్లవాత్మక వైఖరి, అస్పృశ్యతకు వ్యతిరేకమైన ఆయన బోధనలు, అన్నిటికీ మించి ఆత్మ ప్రక్షాళనపై ఆయన ఉపదేశాలు- వీటిని, దేశంలోని వేర్వేరు రాజకీయ, సామాజిక సంస్థలతో పాటు, మహాత్మాగాంధీ నాయకత్వాన నడచిన భారతీయ జాతీయ కాంగ్రెస్ కూడా దత్తం చేసుకుంది.