VIVRUTHA by KAKUMANI SRINIVASARAO Telugu book cover

VIVRUTHA

by KAKUMANI SRINIVASARAO

₹150
In stock · 514 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400804
19523 VIVRUTHA (Literary Criticism) by Dr. Kakumani Srinivasarao RRDS GDC, Bhimavaram తెలుగు కథానికా ప్రక్రియపైన రాసిన యీ వ్యాసాలన్నింటినీ చదివినప్పుడు కాకుమాని శ్రీనివాసరావు మౌలికంగా సౌందర్య తత్త్వ పరిశీలకుడని స్పష్టంగా వెల్లడవుతుంది... బౌమ్ గార్టెన్, క్రోచీ, శాంతాయినా, కాంట్లు ప్రతిపాదించిన Aesthetics, ప్రాచీన భారతీయ ఆలంకారికుల ప్రస్థానాల వెలుతురులోంచీ పుట్టిన యీ సంపుటంలోని వ్యాసాలు ఆధునిక విమర్శకు కావల్సిన బలమైన కొత్త మార్గాన్ని నిర్ధారించి చూపిస్తున్నాయి... సాహిత్య విమర్శలో అంతిమ నిర్ణయమన్నది (Last Statement) లేకపోవడం చేతనే సాహిత్య విమర్శ కూడా సృజనాత్మకంగా మారి కళగా రూపొందుతుంది. కాకుమాని శ్రీనివాసరావు వ్యాసాల్ని చదివినప్పుడు పాఠకుడు కూడా ఆ సృజనాత్మకమైన పని చేయడానికి పూనుకుంటాడు. మధురాంతకం నరేంద్ర నా చిన్ననాటి స్నేహితుడు స్వతహాగా భావుకుడు. తను రూపొందించుకొన్న అభిరుచికి తోడుగా, అధ్యయనం చేసిన కళా తాత్త్వికాంశాలు రచనలను విలువ కట్టడంలో అతడికి బాగా ఉపకరించాయి. ముఖ్యంగా అతడు కథలను అంచనా వేసిన తీరులో తెలుగు సాహిత్యంలో కరుడుగట్టిన దృక్పథాలను పక్కనపెట్టి సాహిత్యరంగంలో ముఖ్య భాగమైన పాఠకుడి పక్షం వహించాడు. ఈ పుస్తకంలో అతడు కథలను విశ్లేషించిన తీరును గమనిస్తే ఒక సిద్ధాంతాన్ని ఆసరాగా చేసుకొని రచనలని తూకం వేసే విమర్శకుడిగాకంటే వివృతమైన రసహృదయుడిగా మనకు దర్శనమిస్తాడు. - బి. అజయ్ ప్రసాద్ ISBN: 978-93-91400-80-4 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520004