VOL 1 CHINNARI PAPALAKU CHITTI POTTI KATHALU by YEDIDA KAMESWARA RAO Telugu book cover

VOL 1 CHINNARI PAPALAKU CHITTI POTTI KATHALU

by YEDIDA KAMESWARA RAO

₹30
In stock · 331 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1. కుక్క బుద్ధి : చీమ సుద్దు అదొక ఖాళీ ప్రదేశం. వీధిలో రెండు ఇళ్ళ మధ్యన వుంది. ఆ వీధి వారందరికీ ఆ ఖాళీ స్థలం ఓ చెత్త కుండీలా ఉపయోగపడుతూ వుంటుంది. ఆ స్థలానికి యజమాని ఒక కుక్క! ఆ చుట్టుపక్కల ఇళ్ళవారు తిని పారవేసిన విస్తరాకులలోని మెతుకులు తింటూ, ఆ నల్ల కుక్క, ఆ దొడ్డిలో నలుమూలలా తిరుగుతూ వుంటుంది. ఏ మూల చప్పుడైనా ఉలిక్కిపడి చూస్తూ గుర్రుపెడుతుంది కోపంగా! ఎప్పుడైనా మరో కుక్క ఆ స్థలంలోకి వచ్చిందంటే ఆ కుక్క దానిమీద పడి, రక్కి, కరిచి ఆ కుక్కను అవతలకు తరిమివేస్తుంది. ఆ స్థలంలో పడిన పులిస్తరాకులన్నీ దాని సొత్తు; ఎవ్వరూ ముట్టుకొనడానికి వీలు లేదు. అయినా చీమలు, ఈగలు ఆ ఆకుల మీద ముసురుతూనే వుంటాయి- నల్ల కుక్క వాటిని తోలేస్తూనే వుంటుంది. ఇలా వుండగా - ఓ పండుగ రోజున రోజూ కంటే ఎక్కువ పులిస్తరాకులు ఆ స్థలంలో వచ్చి పడ్డాయి. వాటిని చూడగానే నల్ల కుక్కకు పండగ ఆనందం కలిగింది.