VOL 1-KISHANCHANDER RACHANALU-GADIDALA KATHALU by KISHAN CHANDER Telugu book cover

VOL 1-KISHANCHANDER RACHANALU-GADIDALA KATHALU

by KISHAN CHANDER

₹100
In stock · 320 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
వివిన మూర్తి ఒకానొక గాడిద ఆత్మకథ అయ్యలారా! అమ్మలారా! నేను సన్యాసినీ గాదు; సాధువునీ కాదు; మహాత్ముణ్ణి కాదు; ధర్మాత్ముణ్ణి కాను; శ్రీ 108వ పీఠాచార్య గహమగహమానన్ద శిష్యుణ్ణి కాదు; ఆకూ యేరూ యిచ్చే సూఫీ గుర్ ముఖ్సెంగ్సీ కాదు; వైద్యుడ్జీ కాదు; డాక్టర్నీ కాదు; సినిమా నటుజ్జీ కాదు; రాజకీయ నాయకుణ్ణి కాదు. నేనొక మామూలు గాడిదని: కాకపోతే చిన్ననాటి చెడ్డపనుల మూలాన్న వార్తాపత్రికలు చదివే పాడురోగం పట్టుకుంది నాకు. అది గూడా యేదో మామూలు రోగమైతే బ్రదికిపోయేదాన్నే నేను. ఆ రోగం ముదిరి ముదిరి నా మామూలుపని యిటుకలు మొయ్యడం గూడా మరిచి పోయి, పత్రికలు చదవడం ప్రారంభించాను. ఆ రోజుల్లో నా యజమాని వొక తాపీ మేస్త్రీ, పేరు శంభూ. మాదసలు అష్టవక్ర గ్రామం. (ఆ గ్రామం గాడిదలకు ప్రసిద్దో, గాడిదల వల్ల ఈ గ్రామానికా ప్రసిద్ధి వచ్చిందో లేకుంటే ఆ గ్రామంలో గాడిదలే ప్రసిద్ధి యిప్పుడు సరిగ్గా చెప్పలేను). నేను సయ్యద్ కరామతలీశా, బారెట్లాగారి యింటి దగ్గర యిటుకలు మోసేదాన్ని. సయ్యద్ కరామతలీ లఖనవూ (లక్నో) లో కల్లా పేరుమోసిన బారెట్లా. వారి సొంత వూరూ మా అష్టవక్ర గ్రామమే. అంచేత వారు మా వూరొచ్చి, తమ ప్రత్యక్ష యాజమాన్యం క్రింద ఒక నూతన గృహనిర్మాణం ప్రారంభించారు. సయ్యద్రికి చదువంటే మహసరదా. తయారైన గదిని వెంటనే లెబ్రరీగా మార్చేశారు. అందులో పుస్తకాలూ అవీ పేర్చిపారేశారు. ప్రొద్దున్నే రాగానే, గదిముందు వరండాలో కుర్చీవేసుకుని వార్తా పత్రికలు చదవడం ప్రారంభించేవారు. ఇటు మిగతా యిల్లు కట్టడం పరిశీలిస్తున్నట్టూ వుండేది. అటు పత్రికలు చదివినట్టూ వుండేది. అప్పుడే నాకూ పత్రికలు చదివే వ్యసనం పట్టుకుంది. ఇటు లేచే గోడదగ్గర, నా వీపు మీదున్న యిటుకలు పారేసి అటు లైబ్రరీవేపుకు పరుగెత్తేదాన్ని, సయ్యద్ గారు పత్రికతో తర్లీనమై వుండేవారేమో, నే వెళ్ళి వెనక నిలబడ్డానన్న సంగతికూడా తెలిసేదికాదు వారికి. నేను నా పత్రికాధ్యయనం ప్రారంభించేదాన్ని. ఒకానొక గాడిద ఆత్మకథ కిషన్ చందర్ రచనలు