
VOL 1 KRISHNAMOHAN KADHA SRAVANTHI
by DR.DAVULURI SRIKRISHNA MOHANA RAO
₹150
In stock · 183 available
PublisherDR.DAVULURI SRIKRISHNA MOHANA RAO
LanguageTelugu
వులూరి శ్రీకృష్ణమోహన రావు 1. లేడిగాడు అతని పేరు 'లేదు'. వాళ్ళింటి పేరు కర్రి. ద్రాక్షారం ఆకులోరి వీధిలో ఒక సందులో ఉంటాది వాళ్ళిల్లు. అతనికా పేరు ఎలా వచ్చిందంటే అతనికంటే ముందు పుట్టినోళ్ళను పుట్టినట్లు, యములోళ్ళు తీసుకుపోతుంటే, వాళ్ళమ్మ పుట్టినోడు యిక్కడ 'లేడు' అనుకొని యములాళ్ళు వెళ్ళిపోతారని ఆపేరెట్టింది. అలానే యములాళ్ళు వచ్చి వాడు 'లేదు' అని వెళ్ళిపోయేవారు. అలా బతికి బట్టకట్టినోళ్ళే అబద్దం, పెంటయ్య వగైరాలు. మా ప్రాంతంలో ఒకడు పుట్టింది అబద్దం అయితే, మరొకడ్ని పెంటమీద పారేసి, తిరిగి తెచ్చుకొన్నారు. పెంటయ్య ವರು ಎದ್ದೆ. కాని వాడికైదేళ్ళప్పుడు కోటిపల్లి శివరాత్రి స్నానాలకెడితే అక్కడ యములాళ్ళ కాడు కనపడ్డాడు. ఆపేరెట్టి తమని బురిడి కొట్టించేసిందని, వాడినొదిలేసి, వాళ్ళమ్మను, పెనాల్టీగా వాళ్ళ నాన్నను గోదాట్లో ముంచేసి, తీసికిపోయారు యములాళ్ళు. వాడెనకాల ఎనిమిదెకరాల మాగాణి, గుడి ఎదుట పెద్ద కొట్టు ఉండటం వలన చుట్టాల్లో వాన్నెవరు పెంచుకోవాలో తేల్చుకోలేక అందరూ కలిసి పెంచేరు. ఆ ఆస్తే లేకపోతే ఏదో అనాధాశ్రమంలో చేర్చేసి చేతులు దులిపేసుకొనేవారు. కాని నిజంగా అనాథను చూసినట్టే చూశారు. అందరూ లేడిగా అని పిలిచేవారు. మొదట్లో వింతగా అనిపించినా, అందరికీ అలానే అలవాటయిపోయింది. లేడిగాడికి ముగ్గురు పినతల్లులు, ముగ్గురు మేనత్తలు ఉన్నారు. వాడింట్లో ఒకరి తర్వాతొకరు, రెండేసి నెలలు మకాం వేసి వాడి బాగోగులు చూసేటట్లు, వాడి ఆస్తి మీదొచ్చేది సమానంగా పంచుకొనేటట్లు ఒప్పందానికొచ్చారు. గుడెదర ఉన్న వాడి కొట్టు వెచ్చాకోమట్ల చేతిలో ఉంది. లేడు తండ్రి ఎవర్నో పట్టుకొని పెద్ద కంపెనీకి హోల్ సేలు రైటు పొందాడు. ఆ కంపెనీ సరుకులు ఆ కొట్లో పెట్టి నడుపుతూ, అవని తన వలన కాదని వెచ్చా వారికి కొట్టుకు నెలనెలా అద్దెయిచ్చేటట్లు, ఆ కంపెనీ సరుకుల మీది లాభంలో పదోవంతు వెచ్చా వారిచ్చేటట్లు ఎగ్రిమెంట్లు చేసుకొన్నాడు. వెచ్చావారు లేడిగాడి బంధువులకు ఆ డబ్బు యివ్వకుండా, నెలనెలా అద్దె సంవత్స రాంతంలో లాభంలో పదోవంతు బేంకులో కట్టేవారు 'లేడు' పేరు మీద. వాడి చదువుమీద ఎవరూ శ్రద్ద పెట్టలేదు. అయినా పదో తరగతి వరకు చదివాడు హైస్కూల్.