VOL - 1 MANOYAGNAM - NOVEL by SURYADEVARA RAMMOHANA RAO Telugu book cover

VOL - 1 MANOYAGNAM - NOVEL

by SURYADEVARA RAMMOHANA RAO

₹150
In stock · 30 available
PublisherMADHUPRIYA PUBLICATIONS
LanguageTelugu
నాందీ ప్రస్తావన పవిత్రమైన వారణాసి (కాశీ)లోని గంగానది ఒడ్డు... మరణించిన ఎనభై ఏళ్ళ వృద్ధుని శవాన్ని దహనం చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. శనానికి నలువేపులా గంధపుచెక్కలు అమర్చారు. శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించారు. శవం తాలూకు బంధువులు, స్నేహితులు శోక సముద్రంలో మునిగి వున్నారు. ఏడ్చి ఏడ్చి వాళ్ళ కళ్ళు ఎరుపెక్కి ముఖాలు ఉబ్బిపోయాయి. డబ్బాలతో నెయ్యిని పోశారు. ఒకాయన కాగడాను వెలిగించి శవం దగ్గరికొచ్చాడు. బంధుమిత్రుల రోదనలు బిగ్గిరగా విన్పిస్తున్నాయి... సూక్ష్మ శరీరం అదృశ్యమైపోగా మిగిలిన కట్టెలాంటి స్థూలశరీరం కూడా మరికొద్ది క్షణాల్లోనే అనంతవాయువుల్లో కలిసిపోబోతోందన్న వాస్తవం నార్ని విచలితుల్ని చేస్తోంది. కాగడాను పట్టుకొన్న వ్యక్తి, ఉబుకుతున్న కన్నీళ్ళతో, తన చేతిని ముందుకు సాచే ప్రయత్నం చేస్తుండగా- అకస్మాత్తుగా శవంమ్మీద నుంచి గంధపు చెక్కలు జారిపడడం, శవం కదులుతున్నట్లుగా అనిపించడంతో, కళ్ళు నులుముకొని వింతను చూస్తున్నట్లుగా, గబుక్కున కాగడాను పక్కన పడేసి, ఆ గంధపు చెక్కల్ని తొలగించాడు. అవును. శవం కదిలిన మాట నిజమే! శవం అనుకున్న ఆ వ్యక్తి కళ్ళిప్పిన మాట నిజమే! “నాన్నగారు...” బిగ్గరగా అరచి, శవం అనుకున్న ఆ వ్యక్తి మీదున్న వస్తువులన్నీ వేగంగా తొలగించి, అతన్ని ఎత్తి తీసుకొచ్చి ఒక పెద్ద మర్రిచెట్టు అరుగుమీద కూర్చోబెట్టి, సపర్యలు చేయడం ప్రారంభించాడు. కళ్ళ ముందు జరిగిన ఆ అద్భుతాన్ని జీర్ణం చేసుకోలేక అందరూ శిలాప్రతిమల్లా అయ్యారు.