VOL 1 - SRI MAHABHARATHAMU - AADI PANCHAKAMU by DR.DASARATHI RANGACHARYA Telugu book cover

VOL 1 - SRI MAHABHARATHAMU - AADI PANCHAKAMU

by DR.DASARATHI RANGACHARYA

₹300
In stock · 10 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
వందే మహాభారతము యధాసముద్రోభగవాన్ యథా మదుర్మహానగః ఉభౌచరత్ననిధయః తధో భారతముచ్యతే వంటిది. సముద్రము మేరుపర్వతము రెండునూ రత్ననిధులు. భారతము ఆ రెండింటి భారతం రచించి కూడ జీవించి ఉన్నవాణ్ణి నేనొక్కడినే నేమో! మనకు తొలుత పద్యభారతం అందించినవారు కవిత్రయం. వీరిలో తొలి కవి నన్నయ్యభట్టు. అతడు భయపడుతూనే మహాభారత ఆంధ్రీకరణకు పూనుకున్నారు. అరణ్యపర్వం మధ్యనే తనువు చాలించాడు. రెండవాడు తిక్కన. తెలుగు తీపి పద్యంతో మిగిలిన భారత రచన ముగించాడు. చావు భయం! నన్నయ వదిలిన అరణ్యపర్వం ముట్టలేదు. మూడవవాడు ఎఱ్ఱన. అతడు అరణ్య పర్వశేషం పూర్తి చేశాడు. ఖిలపర్వం, హరివంశం ఆంధ్రీకరించాడు. తెలుగులో రామాయణాలు ఎక్కువ, భారతాలు తక్కువకు మృత్యుభయమే కారణం కావచ్చు! స్వామి ప్రేరణ! భారతం మూడు సంపుటాల్లో పూర్తి చేయగలిగాను. స్వామి వేలుపట్టుకు నడుస్తున్నాను కాకుంటే నడక నాకేమి ఎరుక? అది శ్రీ భవపునామ సంవత్సర ఉగాది 11-4-1994 ఆ దినం నేను రచించిన మహాభారత ఆవిష్కరణ శుభదినం. రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి పరమానంద మహాభారతం ఆవిష్కరించారు, ఆశీర్వదించారు. బదరీస్వామికి అంకితం సమర్పించాను. అది అనిర్వచనీయ అనుభూతి. అక్షరానికి అందనిది. అర్థ శతాబ్దం పైగా తెలుగు జనులు నా రచనలను అభిమానిస్తున్నారు. అభిమానిస్తూనే ఉంటారు. నేను వృత్తి రచయితను కాను. ప్రవృత్తి రచయితను. నా రచనలు ప్రచురణకు సంపూర్ణ సహకారం అందిస్తున్నది విశాలాంధ్ర రాజేశ్వరరావు. వారికి స్వామి సమస్తం సమకూరుస్తాడు. సికిందరాబాద్. 21-8-2008, 10.30 60 2. దాశరథి రంగాచార్య