VOL 1-SWARNA KHADGAM - 120 by MADHUBABU Telugu book cover

VOL 1-SWARNA KHADGAM - 120

by MADHUBABU

₹120
In stock · 20 available
PublisherMADHUPRIYA PUBLICATIONS
LanguageTelugu
స్వర్ణ ఖడ్గం పార్ట్- 1 సువిశాలమైన సింధూర రాజ్యానికి ఉత్తరదిశలో కాకోల పర్వతశ్రేణులు వున్నాయి. చుక్కల్ని అంటుకునేటంత ఎత్తుగా వుండే ఆ పర్వతాలకు ఆవలిపక్కన అతి భయంకరమైన అడవి ఒకటి కనిపిస్తుంది. ఆ అడవిమధ్యలో నిర్మలమైన జలంతో నిండిన ఓ కోనేరు. ఆ కోనేటి పక్కన ఉన్నతమైన భవంతి. మంత్రవిద్యల్లో చాలా గట్టివాడని పేరొందిన మయూఖుడు అనే మంత్రవాది నివాసస్థలం అది. ప్రపంచం మొత్తంమీద తనను మించిన శక్తిమంతుడు మరొకడు వుండకూడదని మయూఖుడి కోరిక. అందుకు అమోఘమైన నియమనిష్టలతో భైరవీమాత అనబడే మహోగ్రశక్తిని ఆరాధించాడతను. ఆరాధించగా, ఆరాధించగా ఒకరోజు ప్రాతః కాలంలో అతని కర్ణేంద్రియాలకు వినిపించింది ఆ కంఠం "వత్సా.... మయూఖా" అని. శింశువృక్షపు పైభాగంలోనుంచి విరుచుకు వచ్చిన ఎండుకొమ్మలతో అగ్నిని దగిల్చి, దానిమధ్యలో ఆచ్చాదనలేకుండా నిలబడి, మంత్రాలను పఠిస్తున్న మయూఖుడి ఒళ్లు పులకరించింది. "తల్లీ... ప్రచండ భైరవీ... కరుణించావా జననీ... నా మొరను ఆలకించి నన్ను అనుగ్రహించావా!" ఆనందభాష్పాలను విడుస్తూ ఆర్తిగా అడిగాడు. చిన్నగా నవ్వింది అతన్ని పలకరించిన కంఠం. కోటి రుద్రవీణలు మంద్రస్థాయిలో మోగిన అనుభూతి మయూఖుడిని ఆవరించుకుంది. ఆకలిగొన్న పాముల్లా అతనిచుట్టూ ఎగిరిపడుతున్న అగ్నిజ్వాలలు వాటంతట అవే అణిగిపోయాయి. ఆచ్చాదన లేని అతని దిగంబర శరీరంమీద అందమైన వస్త్రం ప్రత్యక్షమైంది.