VOL 10-DR.VASIREDDY SEETHADEVI SAHITHYAM- NAVALALU by DR.VASIREDDY SEETHADEVI Telugu book cover

VOL 10-DR.VASIREDDY SEETHADEVI SAHITHYAM- NAVALALU

by DR.VASIREDDY SEETHADEVI

₹180
In stock · 140 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
వసుంధర వేగుచుక్క వెలవెల పోతోంది. తూర్పు ఆకాశం ఎరుపెక్కింది. నగరానికి దూరంగా, జూబ్లీహిల్స్ కొండలు, గుట్టలు, పొదలు... పోలీసు వ్యాన్ స్పీడుగా వచ్చి, శబ్దం చేస్తూ ఆగింది. పోలీసు బూట్లు కొండరాళ్ళమీద, హిచ్కాక్ సినిమాలో లాగా శబ్దాలు చేస్తున్నాయి. అప్పటికే అక్కడచేరిన జనం తప్పుకొని పోలీసులకు తోవ ఇస్తున్నారు. ఆ కొండరాళ్ళ మధ్యన విద్యార్థిని శవం. రవిక చిరిగి ఉంది. చీర తొలగి వుంది. బట్టలనిండా రక్తం. కొండరాళ్ళమీద రక్తపు మరకలు, తెరుచుకొని వున్న ఆమె కళ్ళు లోకాన్ని నిలదీసి, ఏదో ప్రశ్నిస్తున్నట్టుగా వున్నాయి. క్రమంగా జనం పెరుగుతున్నారు. అందులో ఎక్కువమంది విద్యార్థులే. ప్రెస్ రిపోర్టర్లూ, ప్రెస్ ఫోటోగ్రాఫర్లు శవం చుట్టూ చేరారు. అన్ని యాంగిల్స్ నుండి ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తున్నారు. "మధ్యలో వీళ్ళొకళ్ళు మా ప్రాణాలకు. ఏమైనా అంటే ఉన్నవీ, లేనివీ కల్పించి రాసేస్తారు" గొణుక్కున్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ హత్యకు క్లూ కోసం పరిసరాలను పరిశీలిస్తుండగా ఒక రిపోర్టర్ అతని దగ్గరకు వచ్చాడు. తమకంటే ముందే విషయం తెలుసుకుంటాడేమో అన్నట్టుగా మిగతా రిపోర్టర్లు కూడా జనాన్ని తోసుకుంటూ ముందుకు వచ్చారు. "మానభంగం జరిగాక హత్య జరిగిందంటారా?" ఒక రిపోర్టరు అడిగాడు. ఇన్స్పెక్టర్ చివ్వున తలెత్తి రిపోర్టరు ముఖంలోకి చూశాడు. వళ్ళు మండిపోయింది. "అబ్బే కాదు. హత్య జరిగాక మానభంగం జరిగింది." "అంటే శవాన్ని..." రెండో రిపోర్టర్ అడిగాడు. "ప్లీజ్! నన్ను నా పని చేసుకోనివ్వండి. అర్ధంపర్ధంలేని ప్రశ్నలతో విసిగించకండి" అనేసి ఇన్స్పెక్టర్ తన పనిలో మునిగిపోయాడు. చుట్టూ చేరినవాళ్ళు హత్య గురించి గోలగోలగా మాట్లాడుకుంటున్నారు. విద్యార్థుల ముఖాల్లో విషాదం కన్పిస్తోంది. అదే సమయంలో నలుగురు విద్యార్థినులు ఆతృతతో వచ్చారు. ఒక విద్యార్థిని కొంతదూరంలో నిల్చుండిపోయింది. మిగతా ముగ్గురూ వెనక్కి వచ్చి ఆమెను ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నంలో - "రా! వసూ! కడసారి చూపైనా చూద్దాం" అన్నారు. "నో! నో! నేనురాను. నేను చూడలేను" అంటూ రెండు చేతులతో ముఖం కప్పుకుని, వెక్కి వెక్కి ఏడవసాగింది. "వసుంధరా! ఏడవకు." డా॥ వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం-10