
VOL 11-DR.DASARADHI RANGACHARYA RACHANALU-SABDASWASA
₹125
In stock · 258 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
వేద వారసత్వం పంచిన విప్లవకారుడు రంగాచార్యది మొదటి నుంచీ విప్లవ పథమే. నాడు నిజాం నిరంకుశ పాలనను ఆయన ఏ తెగింపుతోనైతే ఎదిరించారో, నేడు భారతీయ వారసత్వమైన వేదాలను అంతే సాహసికంగా సామాన్యులకు అందించారు. - ఎ. రామ్మోహన్రావు ఆయన ప్రజా రచయితల్లో ఋషి, మార్క్సిస్టుల్లో మతాచారాలను విశ్వసించి ఆచరించే ముని, సామ్రాజ్యవాదుల కుట్రలను, ఆధ్యాత్మిక విషయాలను సమాన సాధికారతతో విడమర్చి చెప్పగల మేధావి. పాఠకుల మనోఫలకాన్ని వెండితెరగా మలచుకొని నవలను నడిపించగల సృజనాత్మక కథకుడు. డెబ్బయ్ మూడేళ్ళ డాక్టర్ దాశరథి రంగాచార్య ఆధునిక తెలుగు సాహితీ రంగంలో విశ్వరూపం ప్రదర్శిస్తున్న అపర వామనమూర్తి. మూడు ఇతిహాసాలు, నాలుగు వేదాలను ఆయన తానొక్కడే సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. నిష్ఠాగరిష్ఠులైన ఘనాపాఠిలకు పరిమితం అయిన ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాలను తెలుగునాట అన్ని వర్గాలవారికి అందుబాటులోకి తెచ్చారు. రంగాచార్య కృషిని అర్థం చేసుకోవాలంటే ఆయన తెనిగించిన మూల గ్రంథాల విస్తృతిని, మహాభారత అనువాదానికి ఆంధ్ర సాహితీ చరిత్ర తొలినాళ్ళలో జరిగిన కృషితోపోల్చి చూడాలి. ఆదిలో మహాభారత అనువాదానికే వెనుకాడిన ఆదికవి నన్నయ తన జీవితకాలంలో రెండు (ఆది, సభా) పర్వాలను పూర్తిగా, మూడో (అరణ్య) పర్వం సగన్ని మాత్రమే అనువదించగలిగారు. తరువాత భారతానువాదానికి పూనుకొన్న తిక్కన నాలుగో పర్వం నుంచి ప్రారంభించి పద్దెనిమిదొ పర్వం వరకూ పూర్తి చేశారు. అసంపూర్ణంగా ఉన్న పర్వాన్ని మాత్రం అలాగే వదిలేశాడు. ఆ తరువాత ఎఱ్ఱన వచ్చి మిగిలిపోయిన పర్వాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది. ఇక ఋషుల నోట అలవోకగా వెలువడిన ఋక్కులు వేదాలుగా రూపొందడానికి ఎన్నో ఏళ్ళు పట్టింది. వందలాది తరాలుగా పండితులు కంఠోపాఠం చేస్తూ సజీవంగా కాపాడుతూ ఉన్నా ఇవి సామాన్యునికి మాత్రం అందిరాలేదు. రంగాచార్య చలవతో మాతృభాషలో వేదాలు చదవగల అవకాశం తెలుగు పాఠకులకు లభించింది. కవిత్రయం (నన్నయ, తిక్కన, ఎఱ్ఱన), ఎందరో ఋషులు కొన్ని శతాబ్దాలపాటు నిర్వహించిన సాహితీ యజ్ఞాన్ని, ఒక్క జీవితకాలంలో ఒంటిచేత్తో