
VOL 11-SARATH SAHITYAM VYSALU LEKHALU
₹95
In stock · 55 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1. స్వవిషయం నేను హౌరా జిల్లా కాంగ్రెసు కమిటీ ప్రెసిడెంటునూ! ఇవాళ నేనూ, నాతోటి కార్యకర్తలూ మా పదవులకు రాజీనామా యిచ్చిన సందర్భంలో యీ సమావేశం యేర్పాటు చేయబడింది కానీ, మీకందరకూ దీర్ఘపన్యాసాలు చేయాలని కాదు! నాకు అప్పగించిన అఖిల భారత జాతీయ మహాసభ జిల్లాశాఖ బరువు బాధ్యతలనుంచి నేను వైదొలగుతున్నాను. అందుకుగల కారణాలు మీ అందరిముందు వివరించటమే, యీ సమావేశం ముఖ్యోద్దేశం, గుట్టు చప్పుడుగాకుండా తప్పుకుంటే, సరిపోయేది. యీ లజ్ఞాప్రదమైన విషయాన్ని యింత అడంబరంగా చాటుకోవలసిన అవసరమేమిటని ప్రశ్న వచ్చింది. నేను మాత్రం అవసరం వుందని భావిస్తున్నాను. మెదలకుండా రాజీనామాచేసి, మోమోటమి కాపాడుకో వచ్చును, కాని, అలా చేసినందువల్ల సత్యదూరుల మవుతాము! తర్వాత, యీ కమిటీ వుంటుందో లేదో నాకు తెలియదు. వున్నా వుండవచ్చు, వుండకపోయినా ఆశ్చర్యమేమీలేదు. లోపలి వ్రణాన్ని కప్పిపుచ్చి, అంతా సవ్యంగా, ఆరోగ్య ప్రదంగా వుందనిచెప్పే పాపానికి మాత్రం నేను వొడిగట్టలేను. ఇది ఒక పాలసీ కావచ్చు; కానీ దీనిని మంచి పాలసీగా భావించలేను. నేను కార్యదక్షుజ్జీకాదు, యీ భారానికి అర్హుడ్జీకాదు. నా అనర్హతకు లోలోపల నొచ్చుకుంటూనే వున్నాను. కాని, మనస్ఫూర్తిగా స్వీకరించిన బాధ్యతను నేడు కారణ రహితంగాగాని, స్వార్ధం నిమిత్తంగాని త్యజించాననే నింద నామీద మోపటానికి లేదు. యివాళ మీరందరూ కొంచెం వోపికబట్టి, 'నామాట' ఆలకించమని ప్రార్ధన. నామనసులో యేదైనా కష్టం ఉండవచ్చు. నా అభియోగంలోని అప్రియశైలి కూడా మీ చెవికి కటువుగా వుండవచ్చు. కాని, ప్రస్తుత పరిస్థితుల్లో నేను వాస్తవమని భావించినదీ, గ్రహించినది మీ ముందు పెట్టేవరకు నాకు మనశ్శాంతి ఉండదు; విముక్తిలేదు. కారణం: వాస్తవాన్ని కప్పిపుచ్చటం, ఆత్మవంచనతో సమానం. యిక్కడే ప్రతి కక్షుల వ్యంగ్య -పరిహాసోక్తులను గురించి కూడా ఒకమాట చెప్పాలి. నేను యింతకాలం నిర్వర్తించిన కార్యక్రమానికి అదే ఫలితమయినపుడు, నేనుగాక మరెవరు అనుభవిస్తారు? అలాకాక, వ్యంగ్య పరిహాసాలకు అవకాశంలేని పక్షాన, భయపడవలసిన పనేముంది? సన్మానించ వలసిన తావున, అనుచిత వ్యంగ్య బాణాలు వదిలే మూర్ఖులే తల వంచుకోవాలి నిష్కపట భావంతో సమస్త విషయాలూ మీ యెదుట వెలిబుచ్చాలని మాత్రం నామనసు