VOL 12-DR.VASIREDDY SEETHADEVI SAHITHYAM - MARO KARNUDI KATHA by DR.VASIREDDY SEETHADEVI Telugu book cover

VOL 12-DR.VASIREDDY SEETHADEVI SAHITHYAM - MARO KARNUDI KATHA

by DR.VASIREDDY SEETHADEVI

₹180
In stock · 125 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మరో కర్ణుడి కథ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని అన్నం తింటున్న శరత్ అన్యమనస్కంగా కన్పించాడు. ఎదురుగా కూర్చున్న సుశీలమ్మకు. "ఏమిటా పరధ్యానం? ఎంతసేపు తింటావా?" తల్లి కొడుకు ముఖంలోకి లోతుగా చూస్తూ అన్నది. శరత్ సమాధానం ఇవ్వలేదు. "మీ నాన్నగారికి నీ మీద చాలా కోపంగా వుంది...." అంటూ ఆగి మళ్ళీ కొడుకు ముఖంలోకి చూసింది. "నాకు తెలుసమ్మా!” "అయినా నీకీ ఉద్యోగం ఎందుకు చెప్పరా! మన వ్యాపారం చూసుకుంటే సరిపోదూ?" "అవసరం అయినప్పుడు అలాగే చూస్తానమ్మా. నాన్నగారు చూసుకుంటున్నారుగా! ^ రికే ఎందుకుండాలని ఉద్యోగంలో చేరాను" అన్నాడు శరత్. భోజనం ముగించి చెయ్యి కడుక్కుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. శరత్ ఎం.ఏ. ఫస్టు క్లాసులో యూనివర్సిటీ ఫస్టున పాసయ్యాడు. యూనివర్సిటీ వాళ్ళు పిల్చి ఉద్యోగం ఇచ్చారు. రెండు నెలలుగా ఉద్యోగం చేస్తున్నాడు. కొడుకు ఉద్యోగం చెయ్యడం రామనాథం గారికి ఇష్టంలేదు. శరత్ టేబుల్ ముందు కూర్చుని పుస్తకం తెరిచాడు. కళ్ళు అక్షరాలను చూస్తున్నాయి. కాని బుర్రకు అందడం లేదు. అమ్మకు ఎలా చెప్పడం? విని తట్టుకోగలదా? ఇప్పటికే నాన్నకు తన మీద కోపంగా వుంది. ఇక ఆ విషయం వింటే తనను ఇంట్లో వుండనిస్తాడా? అందుకే తను ఉద్యోగంలో చేరాడు. ఆ మాటకొస్తే తనకు వ్యాపారం చూసుకోవడమే కష్టం. నాన్న ఎటూ అంగీకరించడు! అమ్మ.... అమ్మకూడా అంగీకరించకపోతే? అమ్మ మనసు తనకు తెలుసు! అమ్మ డబ్బుకంటే మానవత్వాన్నే ఎక్కువ గౌరవిస్తుంది. ఒకవేళ అమ్మకూడా ఒప్పుకోకపోతే? అమ్మను బాధపెట్టక తప్పదా? నాన్న దగ్గిర తనకు ఎప్పుడూ చనువులేదు. చిన్నప్పటినుంచీ తనకు నాన్న అంటే భయమే. నాన్న తనను ఏనాడూ ఆప్యాయంగా ఒళ్ళో కూర్చో బెట్టుకున్నట్టు జ్ఞాపకం లేదు. నాన్న స్వభావం అంతే అనుకోవడానికి కూడా వీల్లేదు. తమ్ముడికి నాన్నదగ్గిర చాలా చనువు. తమ్ముడు అమ్మదగ్గిర కంటే నాన్న దగ్గిరే ఎక్కువ మారాం చేస్తాడు. డా॥ వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం-12