VOL 13-DR.VASIREDDY SEETHADEVI SAHITHYAM- SAHITYA - SAMAJIKA VYASALU by DR.VASIREDDY SEETHADEVI Telugu book cover

VOL 13-DR.VASIREDDY SEETHADEVI SAHITHYAM- SAHITYA - SAMAJIKA VYASALU

by DR.VASIREDDY SEETHADEVI

₹125
In stock · 329 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
నా సాహిత్య నేపథ్యం మా నాన్నగారు పెద్ద పండితులు, ఎందరో కవులూ, మహాకవులూ మా ఇంటికి వచ్చేవారు. సాహిత్య చర్చలు జరిపేవారు నా చిన్నప్పుడు. మా ఇల్లు ఒక సరస్వతీ నిలయంగా ఉండేది. చిన్నప్పట్నుంచీ సాహితీ చర్చలు వినడమే నా సాహిత్యానికి నేపథ్యం." "మా అన్నయ్య కథలురాసేవాడు. కుటుంబరావుగారు, గోపీచంద్రు, ధనికొండ మొదలైనవారు మా అన్నయ్యతో కూర్చుని సాహిత్య చర్చలు చేస్తుంటే చిన్నప్పుడు ఎంతో శ్రద్ధగా వినేదాన్ని - అలా ఏర్పడిన నేపథ్యంలోనే నా సాహిత్యం పల్లవించింది." "మీ సాహిత్య నేపథ్యం గురించి చెప్పమంటే" సాధారణంగా రచయిత్రులు, రచయితలు పైవిధంగా చెబుతూ ఉంటారు. కానీ నాకు అలాంటి అదృష్టం లేదు. మా ఇల్లు సరస్వతీ నిలయం కాదు. ఇంట్లో వడ్లబస్తాలూ, ఇంటిముందు గొడ్లూ, పేడా, పిడకలూ - ఒక పల్లెటూరి సన్నకారు రైతు ఇల్లు. మా నాన్నా మామూలు రైతు. పెద్దగా చదువుకోలేదు. మా అమ్మకు తెలుగు చదవడం వచ్చు. వీధిబడిలో ఎంతవరకు చదివిందో తెలియదు. ఆ మాటకొస్తే మా ఊళ్ళోనే ఆ రోజుల్లో పెద్దగా చదువుకున్నవాళ్ళు లేరు. అందువల్ల అడగ్గానే ఇదీ నా సాహిత్య నేపథ్యం అని చెప్పలేను. తెరిచిన పుస్తకంలా కళ్ళముందున్న ప్రకృతిని చూస్తుంటే నాచిన్న బుర్రలో ప్రశ్న-ప్రశ్న తర్వాత ప్రశ్న - ప్రశ్నల పరంపర నాలో ఏదో జిజ్ఞాస- అలజడి - తోచని తనం - నన్ను అశాంతికి గురిచేసేవి. నేను బాల్యంలోని మాధుర్యాన్ని ఆస్వాదించలేదు. కారణం ఊహ తెలిసినప్పట్నుంచి, ఆలోచించడం మొదలుపెట్టినప్పట్నుంచీ నా బుర్రనిండా ప్రశ్నలే. ఈ ప్రశ్నించే శక్తి మానవుడికీ లేకపోయినట్టయితే ఈ సంఘం, ఈ నాగరికత, ఈ విజ్ఞానం, ఈ సాహిత్యం, ఏదీ ఉండేదికాదనిపిస్తుంది. ఈ ప్రశ్నించే శక్తే మానవుడ్ని పశువు నుంచి వేరుచేసి, ప్రకృతి రహస్యాలను ఛేదించుకుంటూ, వైజ్ఞానిక యుగంలోకి నడిపిస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే మానవుడి పురోభివృద్ధికి మూలం ప్రశ్నే. ప్రశ్నల నుంచే నా సాహితీ నేపథ్యం రూపుదిద్దుకుంది. అంతేకాదు. ప్రశ్న నుంచే నా జీవితయాత్ర ప్రారంభం అయింది. నాచుట్టూవున్న ఆడవాళ్ళ బతుకుల్ని చూసి ఇదే జీవితం కాదు, ఇలాగే బతకక్కర్లేదు. మరోలా ఎందుకు బతకకూడదు? ఈ ప్రశ్న నన్ను ప్రత్యేకమైన మార్గంలో నడిపించింది. అందుకే అంటాను - సాహితీ జీవితం, నాజీవితం