VOL 14-DR.VASIREDDY SEETHADEVI SAHITHYAM - SAHITHI GAVAKSHAM by DR.VASIREDDY SEETHADEVI Telugu book cover

VOL 14-DR.VASIREDDY SEETHADEVI SAHITHYAM - SAHITHI GAVAKSHAM

by DR.VASIREDDY SEETHADEVI

₹250
In stock · 46 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
భారత మహిళ నాడు - నేడు జన్మనెత్తింది ఏ గడ్డమీదైతేనేం జీవించింది ఏ దేశంలో నైతేనేం మతమేదైతేనేం - అభిమతమేదైతేనేం ఐన్స్టీను జన్మనిస్తేనేం స్టాలిన్ కంటి వెలుగైతేనేం మావోతో కలిసి నడిస్తేనేం ముజిబుర్ రక్తం పంచుకుంటేనేం చేసేది ఏ వృత్తయితేనే సాగేది ఏ ప్రవృత్తయితేనేం గడిచిన నాడైతే నేం గడుస్తున్న నేడైతేనేం స్త్రీ జాతికి మిగిలింది పెన్నీటి కన్నీరే కారిన కన్నీటికంటే ఇంకిన మున్నీరే అధికం! భారత స్త్రీ గౌరవ గాథలతో ఆకాశం ప్రతిధ్వనించి ఉండవచ్చు. పృథ్వీ దద్దరిల్లి ఉండవచ్చు. పాతాళం కంపించి ఉండవచ్చు. కాని ఆమె కళ్ళలోని శ్రావణ మేఘాలు ఈనాటికీ విచ్చిపోలేదు. హిమాలయ పర్వతాలు పులకించేలా కీర్తించబడిన ఆమె గౌరవ గాథలనూ, సముద్రపులోతుల్ని నిర్జించగల ఆమె సహనాన్నీ, ఆమె కన్నీటితోనే చరిత్రగా రాయడం జరిగింది. ఏ దేశ చరిత్ర పుటలు తిప్పినా కన్పించేది. స్త్రీజాతి బానిసత్వమే! విన్పించేవి ఆమె కన్నీరు చెప్పిన కరుణకథలే! ఆమె త్యాగాలనూ సహనాన్నీ మమతల్నీ ఆత్మ సమర్పణనూ, ఆమె బలహీనతలుగా గుర్తించింది సమాజం, మానవ సమూహం!