VOL 2-AMUKTHAMALYADA SOUNDARYALAHARI VYAKYANAM by THUMMAPUDI KOTESWARA RAO Telugu book cover

VOL 2-AMUKTHAMALYADA SOUNDARYALAHARI VYAKYANAM

by THUMMAPUDI KOTESWARA RAO

₹500
In stock · 79 available
PublisherTHUMMAPUDI KOTESWARA RAO
LanguageTelugu
కావ్యరచనా కాలం (1) స్వప్నవృత్తాంతం దీనికి స్వప్న వృత్తాంత మొకటే ఆధారం. కవి చక్రవర్తి కళింగ జైత్ర యాత్రాసందర్భంలో బెజవాడలో కొన్ని రోజులుండి ఒక హరివాసరంనాడు శ్రీకాకుళ స్వామిని దర్శించినట్లు కావ్యమే స్పష్టంచేస్తున్నది. అదెప్పుడు ? రాయలు కొండవీటి విజయానంతరం "ధరణికోటకు విచ్చేసి అమరేశ్వర మహాదేవునకు తులాపురుష, మహాదానమున్ను చేయ నవధరించి- తిరిగి విజయనగరానకు విచ్చేసి మఱి కళింగ దేశ విజయార్థమై విచ్చేయుచు అహోబలానకు వేంచేసి దేవుని దర్శించి శ్రీవిజయాభ్యుదయ శా.సం. 1438 యగు నేటి యువ సం॥ర పుష్యశుద్ధ 15 శుక్రవాసర మందు శ్రీఅహోబల దేవునకు -'' నగలర్పించారట. కనుక అహోబల శాసనం యువ పుష్యం - సింహాచల దర్శనం ధాత చైత్రం - నడుమ శ్రీకాకుళాంధ్ర దేవ సందర్శనం- స్వప్న వృత్తాంతం. శ్రీగురుజాడ శ్రీరామమూర్తి పంతులుగారు ఉదాహరించిన చామర్ల కోట కైఫీయతు (చూ. వారి కవిజీవితాలు) కూడా అహోబల శాసనాన్ని ధ్రువపరుస్తున్నది. ఆవాక్యం- విద్యానగరికి విచ్చేసి శా.సం. 1438 (కీ. శ. 1515) అగు నేటి యువనామ సంవత్సరాన కళింగ దేశము జయించవలెనని