VOL 2 CHINNARI PAPALAKU CHITTI POTTI KATHALU by YEDIDA KAMESWARA RAO Telugu book cover

VOL 2 CHINNARI PAPALAKU CHITTI POTTI KATHALU

by YEDIDA KAMESWARA RAO

₹30
In stock · 411 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1. తిండిపోతులు వరిచేనులో మొక్కలు చిక్కగా పెరిగి చక్కగా వున్నాయి. ఎరువు వేసి, నీరుపెట్టి పొలం కాపు ఎంతో తృప్తితో ఇంటికి వెళ్ళిపోయాడు పది పదిహేను రోజులలో తిరిగి వద్దామని! వరి మొక్కలతో పాటు చేనులో తుంగ మొక్కలు కూడా బాగా పెరిగాయి. వాటికి వేరులున్న చోట దుంప ఉంటుంది. పైగా ఎరువు దొరికింది. వరి మొక్కల కంటే ఏపుగా పెరిగాయి: చిలవలు పలవలు వేశాయి. వారం, పది రోజులు గడిచాయి. వానలు లేవు. ఎండలు మండిపోతున్నాయి. చేనిలో నీరు హరించుకు పోయింది. నీరు చాలక వరి మొక్కలు వాలిపోయాయి. తుంగ మొక్కలు వాడలేదు; ఏపుగా ఎదిగి నిలబడి వున్నాయి. తుంగ మొక్కలను చూసి వరి మొక్కలు అన్నాయి. "చేనిలో నీరంతా మీరు పీల్చేస్తున్నారు. మాకు చుక్కంత కూడా దొరకడంలేదు. కొంచెం మాకు కూడా మిగల్చండి..." తుంగ మొక్కలు అన్నాయి: "మాకు మల్లే నీరు పీల్చడం మీకు చేత గాదు. మమ్మల్ని చూసి అసూయ పడుతున్నారు. చేతనైతే నీరు తాగండి, లేకపోతే ఎండిపోండి.... వరి మొక్కలు అన్నాయి: