
VOL 2-SWARNA KHADGAM - 120
by MADHUBABU
₹120
In stock · 20 available
PublisherMADHUPRIYA PUBLICATIONS
LanguageTelugu
స్వర్ణ ఖడ్గం పార్ట్-2 భవభూతి దగ్గర్నించి తీసుకొచ్చిన బంగారురేకుల గ్రంథంలోని విషయాలను కపాలకుండలి వివరిస్తుంటే సాలోచనగా వింటున్న మయూఖుడి మనసులో తళుక్కున మెరిసింది ఒక ఆలోచన. "పచ్చల పతకం, లంబకర్ణుడి మధుపాత్ర, భిల్లగూడెంలోని నాగమణి మనకి స్వర్ణఖడ్గాన్ని సాధించే మార్గాన్ని సూచిస్తాయి. అంతేకదూ?" పొడవాటి కేశాలను ఎడమచేత్తో దువ్వుకుంటూ అడిగాడతను. "అంతే. ఆ విషయమే ఈ గ్రంథంలో లిఖించబడి వున్నది" బంగారురేకుల్ని ఒక వరుసలో సర్ది, అవతల పెడుతూ చెప్పింది కపాలకుండలి. "విదర్భ రాజవంశంలో వుంచబడిన పతకాన్ని గురించి మర్చిపోదాం. లంబకర్ణుడు నీలపర్వతాల్లో నివసిస్తూ వుంటాడు. అతడి దగ్గరవుండే మధుపాత్రను కూడా కొద్దిసేపు పక్కన పెడదాం. భిల్లగూడెపు నాగమణిని గురించే ఇప్పుడు మనం ఆలోచించాలి. అది ఎక్కడ వుంటుంది? ఆ గూడెంలోనే వుంటుందా?" అంటూ కనులు మూసుకుని తన దక్షిణహస్తాన్ని గాలిలో వూపాడు మయూఖుడు. వెంటనే ప్రత్యక్షం అయిందొక ఆకారం అతనిముందు. వికృతంగా వున్న ముఖంతో, మరుగుజ్జు స్వరూపంతో కొంచెం అసహ్యం కలిగించేట్లు వున్నది ළයි. "భిల్లుల దగ్గర వుండే నాగమణి నాకు కావాలి. తీసుకురా” గంభీరమైన కంఠంతో ఆజ్ఞ ఇచ్చాడు మయూఖుడు. అంగీకారసూచకంగా తలవూపి అక్కడినించి మాయమైపోలేదు ఆ మరుగుజ్జు ఆకారం. "భిల్లగూడెంలోని కొండదేవర గుండెలమీద వుండాల్సిన ఆ నాగమణి ఎప్పుడో మాయమైపోయింది దేవరా... సుభద్రుడు అని పిలవబడే నాగరికుడు