
VOL - 2 THRILINGA PARIPALA - THRISAHASRA GATHAKALA (MOODUVELA SAMVASTARALA NAATI TELANGANA, ANDHRA RAJULA PARIPALANA)
₹150
In stock · 50 available
PublisherKUNAREDDY RAMARAO
LanguageTelugu
ముందుమాట నేను చరిత్ర విభాగంలో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో బి.ఏ. డిగ్రీ పట్టా పొందాను. నేను కాలే రోజుల్లో రెండు ఆలోచనలు నాలో ఇమిడివుండేవి. అనగా ఈ సృష్టి ఎలా పుట్టింది? సైన్స్ ఏ చెబుతుంది? వేదాలు, పురాణాలు ఏమి చెబుతున్నాయి? అని, ఈ ప్రాంతంలో మానవజీవనం ఎల ప్రారంభమైంది, ఈ ఊరి పేర్లు ఎలా ఉద్భవించాయనే విషయాలు తెలుసుకోవాలనే కుతూహలు ఉండేది. మొదటి ఆలోచన భగవంతుని దయవల్ల 'సృష్టి ఆవిర్భావం-సైన్స్ అంతర్భావం' అనే గ్రంథా వ్రాయగలిగాను. ఇందులో సృష్టి ఆవిర్భావం గురించి సైన్స్ ఏం చెబుతుంది, వేదాలు, పురాణా ఏమి చెబుతున్నాయో సవివరంగా తెలుపగలిగాను. నా రెండవ ఆలోచన మూడువేల సంవత్సరా నుంచి మనం తిరుగాడుతున్న ప్రదేశం ఎలా ఉండేది, ఇక్కడ ఆ కాలంలో ఎవరున్నారు, ఎవడా వచ్చారు, ఇప్పుడున్న గ్రామాలు, ఊళ్లు ఎలా ఉద్భవించాయి, అప్పటి రాజులకాలంలో ధరలు ఎంత ఉండేవి అన్నిటినీ 'త్రిలింగ పరిపాల త్రిసహస్ర గతకాలం'లో రెండు భాగాలలో సవివరంగా వివరించగలిగాను. ఈ కులాలు ఎలా ఏర్పడ్డాయి అనే అన్వేషణ క్రీ.శ.1930 సం॥ ప్రాంతంలో ప్రముఖ చరిత్రకారుడు శ్రీ కొత్త బావయ్యచౌదరిగారు 'కమ్మవారి చరిత్ర' గ్రంథంలో ఒక్క కమ్మవారి గురించే కాకుండా రెడ్డి, కాపు, వెలమకులాలను కలిపి విశ్లేషించారు. కమ్మ, కాపు, రెడ్డి, వెలమలు సూర్యకుల, చంద్రకుల, యదువంశ నాగవంశంవారని తెలుపుతూ, ప్రారంభంలో కులాలే లేవని. ప్రాంతాలవారీగా పిలిచేవారని, అందరూ పంటరైతులేనని, 11వ శతాబ్దంలో పల్నాటియుద్ధం తర్వాత కులాల విభజన జరిగిందని తన గ్రంథంలో తెలిపారు. ఈ నాలుగు కులాలవారు కలిపి విశ్లేషించి వారి కులాలు, ఇంటినామాల ప్రకారం, గోత్రాల ప్రకారం ఎలా వేరుపడ్డారో తెలిపారు. క్రీ.శ.1915 సం॥లో శ్రీ సూర్యదేవర రాఘవయ్య చౌదరిగారు తన 'బ్రాహ్మణేతర విజయం' గ్రంథంలో కమ్మ, కాపు, రెడ్డి, వెలమలందరూ సూర్యవంశ, చంద్రవంశ క్షత్రియులని, వారు బౌద్ధమతంలో చేరడంవల్ల అప్పటి బ్రాహ్మణసమాజం వీరందరూ చతుర్వర్ణ శూద్రులుగా పరిగణించబడ్డారని తెలిపారు. శ్రీ కొత్త బావయ్యచౌదరిగారు అన్ని కులాలను పరిగణనలోకి తీసుకొని, అన్ని కులాల గురించి తన గ్రంథంలో విశ్లేషించారు. అదేబాటలో నేను 'త్రిలింగ పరిపాల- త్రిసహస్రకాల' అనే రెండు భాగాలలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులను మొదటి భాగంలోని రాజకుల శూద్రులైన కమ్మ, రెడ్డి, కాపు, వెలమకులాలను కలిపి చారిత్రక ఆధారాలతో వారివారి కులాల గురించి విశ్లేషించగలిగాను. మొదటిభాగంలో బ్రాహ్మణులు, వారి ఇంటి నామాలు ఏర్పాటు, బ్రాహ్మణులు మనదేశాన్ని పాలించిన ప్రముఖ బ్రాహ్మణరాజులు ఎవరో తెలుపబడింది. క్షత్రియుల ఇంటినామాలు ఎలా ఏర్పడ్డాయి. క్షత్రియులలో బౌద్ధమతాన్ని ఆచరించడంవల్ల వారిని బ్రాహ్మణసమాజం చతుర్వర్ణాలుగా పరిగణించ