
VOL -2 VASANTHOSTAVAM
by MADHUBABU
₹150
In stock · 105 available
PublisherSATYAVANI PUBLICATION
LanguageTelugu
వసంతోత్సవం - 2 5 వసంతోత్సవం -II అబ్బో ... ధైర్యం చాలా ఎక్కువగా దర్శనం ఇస్తోంది... మనసులోని మాటను చుట్టుదారిన బయటపెట్టేస్తున్నాడు” వెక్కిరింపుగా అన్నది మల్లి. "వేళాకోళం వద్దు నిజాయితీగా చెపుతున్నాను. నన్ను పెళ్ళిచేసుకుంటావా?” ఈసారి సూటిగా అడిగేశాడు శంకరుడు. "చేసుకుంటాను. కాని ఇప్పుడు కాదు" తను కూడా అలాగే చెప్పింది ఆమె. దీపావళి పండగరోజున బాలబాలికలు గిర్రుగిర్రున తిప్పే పూలపట్టా మాదిరి వింతగా వెలిగిపోయింది శంకరుడి వదనం. “నువ్వు ఎప్పుడంటే అప్పుడు... ఎన్నిరోజులైనా, ఎన్ని సంవత్సరాలయినా, ఎన్ని జన్మలైనా ఎదురుచూస్తాను" అన్నాడు. "కవిత్వం చెప్పకు. వంటశాలలో సైనికులు ఎంగిలి చేసి వదిలిన పాత్రలను శుభ్రం చేసుకునేవాడికి కవిత్వంతో అవసరం లేదు" అన్నది మల్లి.