VOL 3-BHAMIDIPATI KAMESWARA RAO RACHANALU-EESAF KATHALU - 100.00 by BHAMIDIPATI KAMESWARA RAO Telugu book cover

VOL 3-BHAMIDIPATI KAMESWARA RAO RACHANALU-EESAF KATHALU - 100.00

by BHAMIDIPATI KAMESWARA RAO

₹100
In stock · 51 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఈసప్ కథలు 1. ఉత్తరపు గాలి - సూర్యుడు : నేనే బలాసిని నీకంటె. సూ : పందెం వెయ్యి : ఇదుగో, ఈ దారివెంట పొయ్యేవాడి దుస్తులు తొలిగిపోయేలాగు మనిద్దరిలో ఎవరు చెయ్యగలిగితే వారిది ఎక్కువ శక్తి. సూ : సరే. నువ్వు ముందు యత్నించు. ۵ : (యత్నిస్తూ) ఔరా! నా శక్తికొద్దీ వీస్తున్నాను. కాని నేను జోరు ఎక్కువ చేసిన కొద్దీ ఇతడు తన దుస్తుల్ని మరింత బిగించి పట్టుగుంటున్నాడు. నా కింత లాభించేటట్టు తోచదు. అయ్యా! సూర్యుడా! నేను ఓడిపోయాను. నావల్ల కాదు. ఇతడి దుస్తులు నేను తొలగించలేను. నువ్వు యత్నించు. నెగ్గగలవేమో! సూ : సరే. (తనలో) మన ప్రభావం కొంచెం జోరు చేద్దాం. ఆఁ, ఉక్క ఎక్కువైంది. ఆ, ఇతడు తనపై కోటు తీసేశాడు. ఇంకా జోరుగా కాస్తాను. ఆC, ఇతడు ఒంటిమీద దుస్తులు ఒక్కొక్కటే తీసేస్తున్నాడు. ఆఁ, చివరికి వెళ్ళి ఆ కాలవలో స్నానం చేస్తున్నాడు.- ఏమయ్యా! గాలిగారూ! ఎవరిది విజయం? ۵ : మీదే. మీ ఉపాయం నా బలంకంటె బలవత్తరం అయింది. 2. నదులు - సముద్రం ( నదులన్నీ కలిసి సముద్రుడిని తప్పు పట్టబోయి) న : సముద్రమా! మేం అంతా వచ్చి నీకెరటాల్తో కలిసేటప్పుడు మేం తియ్యగా తాగ వీలుగా ఉంటాం గదా! నీలో కలవగానే నువ్వు మమ్మల్ని మార్చిపారేసి ఉప్పగా చేసి తాగడానికి వీల్లేకుండా చేసేస్తావే? స : ఓయ్ నదులూ! ఆ మార్పు గురించి కుట్ర ఏదేనా ఉంటే నా మీద పారెయ్యాలని మీ ఊహ! ఓ సలహా చెబుతాను వినండి. మీకు అలాంటి మార్పు రాకుండా ఉండాలంటే, మీరు నాలోకి దిగబడడం మానెయ్యండి, మరో చోటికి ఎగబడండి. 3. పర్వతం - ప్రసవ వేదన (ఒక పర్వతం ఎంతో కంగారుపడి, నొప్పులొచ్చినట్టై పెద్ద పెద్ద మూలుగులు మూలిగి అరుపులు అరవగా, సంగతేమిటో అని లక్షలాది జనం దేశదేశాల్నించీ వచ్చి, ఏమి ప్రళయం పుట్టుగొస్తుందోకదా, భగవంతుడా, అని బెంగెట్టుగుని, ఆదుర్దాలో ఉండగా, ఒక గుహలోంచి ఒక ఎలగ ఇవతలికి పడగా) ఒక ఇంతంత నొప్పులకీ ఇదా ఫలితం ? మరొ : నయం కాదూ! ఈ మాత్రం కనకుండా ఇంతకంటె నొప్పులు పడగల వాళ్ళున్నారు.