
VOL 6-SARATH SAHITHYAM BADADEEDI-NISHKRUTHI-DATTA
₹150
In stock · 161 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఈ పృధివిలో ఒక రకం మనుష్యులున్నారు. వాళ్ళు రెల్లుగడ్డి లాంటి వాళ్ళు. గుమని మండనూ వచ్చు. చప్పగా చల్లారిపోనూవచ్చు వాళ్ళ వెనకాల సర్వదా ఓ మనిషి మాత్రం ఉంటూ ఉండాలి. అవసరాన్ని బట్టి గడ్డి వేస్తూ ఉండటానికి, ఆడవాళ్ళు దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలో నూనె, పత్తితోపాటు ఒక పూచిక పుల్లకూడా వేస్తారు. ఆ దీప శిఖ తగ్గిపోతున్నప్పుడు ఈ పనికిమాలిన పుల్ల ఎంతైనా అవసరం - ఎగతోయడానికి. అలా చేయకపోతే నూనే, పత్తీ ఉన్నప్పటికీ దీపం. వెలగదు. సురేంద్రనాథుడి స్వభావం కూడా చాలావరకు ఇలాంటిదే. అతడికి బలమూ, బుద్ధి, విశ్వాసమూ అన్నీ ఉన్నాయి. అయినా అత డేపనినీ సంపూర్ణంగా నిర్వహించలేదు. కొంత పనిని అతడెంత ఉత్సాహంతో చేస్తాడో, మిగిలిన దానిని అంత అశ్రద్ధగా వదిలేసి మెదలకుండా కూర్చుంటాడు. అప్పుడే ఒక మనిషి అవసరం అతణ్ని పురికొల్పటానికి, సురేంద్రుడి తండ్రి పడమట దేశంలో ఒక వకీలు. వంగదేశంతో అతడికంతగా సంబంధమేమీలేదు. ఇక్కడే సురేంద్రుడు తన ఇరవయ్యోయేట ఎం.ఏ. ప్యాసయినాడు-కొంత తన శక్తివల్లా, కొంత సవతితల్లి ప్రోత్సాహం వల్లా, ఇలా సవతితల్లి ఎంత ప్రోద్బలం కలిగిస్తూ అతడివెంట అంటిపెట్టుకుని ఉన్నప్పటికీ, తనకేదైనా స్వాధీనతా ఐలం ఉన్నదా లేదా అన్న సంగతి అతడు చాలాసార్లు తెలుసుకోలేక పోయేవాడు. సురేంద్రుడంటూ ఓ స్వతంత్ర జీవి జగత్తులో ఉన్నాడా అంటే లేడు. ఈ సవతి తల్లి వాంఛలే ఒక మనుష్య రూపాన్ని ధరించి పని పాటలు, చదువు సంధ్యలూ, తిండి తిప్పలూ, పరీక్షలు ప్యాసవడమూ మొదలైనవన్నీ నిర్వర్తిస్తున్నాయి. ఈ సవతి తల్లి తన సంతాన విషయంలో కొంత ఉదాసీనంగా ఉన్నప్పటికీ, సురేంద్రుణ్ణి అంతులేనంత అదుపులో పెట్టుతూ వుండేది. అతడు ఉమ్మి వేయటం కూడా ఆమె దృష్టిని అతిక్రమించి జరిగేదికాదు. ఈ కర్తవ్య పరాయణి ఐన స్త్రీ ఆజ్ఞలో వుండి సురేంద్రుడు చదువు సంధ్యలు నేర్చుకున్నాడు. కాని తన మీద తాను ఆధారపడి ఉండటాన్ని మాత్రం నేర్చుకోలేదు. తనమీద తనకు విశ్వాసం లేదు. ఏ పనీ సర్వాంగ సుందరంగా తన వల్ల నెరువేరుతుందనే విశ్వాసం కూడా లేదతడికి. ఎప్పుడు తనకేది అవసరమో, తనెప్పుడు ఏం చెయ్యాలో సంపూర్ణంగా మరొకరిమీద ఆధారపడి ఉండేవాడు. నిద్రవస్తున్నదో. ఆకలివేస్తున్నదో - చాలా సమయాల్లో ఇది కూడా నిర్ణయించుకోలేక. పోయేవాడు. జ్ఞానం వచ్చినప్పటినుంచి, సవతి తల్లి మీద ఆధారపడి, ఈ పదిహేనేళ్ళూ గడిపేశాడు. కేవలం సవతితల్లి అతడికి అన్ని పనులూ చేసిపెట్టుతూ ఉండాలి -ఇరవై నాలుగు గంటల్లోనూ ఇరవై రెండు గంటలు తిరస్కారము, అనుషంగమూ,