
VOL 7-DR.VASIREDDY SEETHADEVI SAHITHYAM - MANINI - MANASU - MANASU KATHA - RAGAHELA
₹180
In stock · 39 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మానిని - మనసు “అనూ, అనూ! ఏయ్! నిన్నేనోయ్!" "వస్తున్నానండీ!" "త్వరగా రావాలి" "ఏమిటండీ ఆ గావు కేకలు?" అంటూ అనసూయ వంటింట్లో నుంచి వచ్చింది. చేతులనిండా అట్టపెట్టెలూ, ప్లాస్టిక్ బ్యాగులూ పట్టుకొని నిల్చుని వున్నాడు రమణమూర్తి. "అవన్నీ ఏమిటండీ?" ఆశ్చర్యంగా అడిగింది. "తీసుకొని చూడు! త్వరగా అందుకో నా చేతులు పీకుతున్నాయ్!" "బజారంతా కొనుక్కొచ్చినట్టున్నారు" అందుకుంటూ అన్నదనసూయ. ప్యాకెట్సు ఒక్కొక్కటే విప్పసాగింది. ఆమె కళ్ళలో కాంతిరేఖలు కదిలాయి. "బాగున్నాయా చీరలు!" "చాలా బాగున్నాయ్! అయినా ఒకేసారి ఇన్ని చీరలెందుకండీ!" "మీ ఆడవాళ్ళకు ఎన్ని చీరలున్నా తృప్తి ఉండదుగా?" "ఈ రోజుల్లో ఆడవాళ్ళకంటే మగవాళ్ళకే బట్టలమీద మోజు ఎక్కువైంది." "ఓహో రాణీగారు కొత్త విషయాన్ని కనిపెట్టినట్టున్నారు." "టికెట్లు దొరికాయా?" "వెయిటింగ్ లిస్టులో ఉన్నాం!" "కన్ఫరమ్ కాకపోతే?" "నా స్నేహితుడు ఒకడు రైల్వేలో పనిచేస్తున్నాడు. రేపుకనఫరమ్ చేయిస్తానన్నాడు." "మీరు బట్టలు తెచ్చుకోలేదేం?" "నాకున్నవి చాల్లె!" "కనీసం రెండు షర్టులైనా కొనుక్కోకూడదూ?" "ఈ నెల బడ్జెట్ అయిపోయింది. వచ్చే నెలలో కొనుక్కుంటాను." ఒక్కొక్క చీరే అద్దంముందు నిల్చుని భుజం మీద వేసుకుని చూడసాగింది అనసూయ. ఆమె పెళ్ళయి ఆరునెలలైంది. హనీమూన్కు వెళ్ళాలని ఎంతో కుతూహల పడింది. కాని రమణమూర్తికి ఆఫీసులో శెలవు దొరకలేదు. ఇంతకాలానికి భర్తతో కలిసి ఊటీకి వెళ్ళబోతున్నది. భర్తతో ఊటీలో గడపబోయే మధుర క్షణాలను ఊహించుకుంటూ అద్దంముందు నిలబడిపోయింది.