VOL 7-SARATH SAHITHYAM GRUHADAHANAM SHUBADHA PUJARI - 140.00 by SARATH CHANDRA CHATARJI Telugu book cover

VOL 7-SARATH SAHITHYAM GRUHADAHANAM SHUBADHA PUJARI - 140.00

by SARATH CHANDRA CHATARJI

₹140
In stock · 5 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
గృహదహనం మహిమబాబు పరమమిత్రుడు సురేష్, ఇద్దరూ ఒకేసారి ఎఫ్.ఏ. పరీక్షలో కృతార్థులైనారు. సురేష్ వెళ్ళి మెడికల్ కాలేజీలో చేరాడు. మహిమబాబు మాత్రం సిటీ. కాలేజీని విడిచిపెట్టలేదు. అది సురేష్బాబు ఆత్మగౌరవానికి అఘాతమైంది. అన్నాడు: "మహిమ్! బి. ఏలు, యం.ఏలు, ప్యాసైనంతమాత్రాన ఏమీ లాభంలేదని అనేకసార్లు చెప్పారు. ఇప్పటికైనా మించిపోయిందిలేదు! నువ్వు వచ్చి మెడికల్ కాలేజీలో చేరవచ్చు." "చేరవచ్చు. కాని అందుకయ్యే ఖర్చు విషయం కూడా ఆలోచించాలిగా!" అన్నాడు నవ్వుతూ మహిమబాబు. "నీ తలకు మించిన ఖర్చేమీకాదు. అదీగాక నీకు 'స్కాలర్షిప్' కూడా దొరుకుతుంది." మహిమబాబు నవ్వి వూరుకున్నాడు. "నవ్వుతాలు కాదు మహిమ్! ఇంకా ఆలస్యం చేసినందువల్ల లాభంలేదు. ఈ వారంలోనే నువ్వు 'ఎడ్మిట్' కావాలని నా కోరిక, డబ్బు దస్కం సంగతి తరువాత చూసుకోవచ్చు." "సరే చూద్దాం." "సరే చూద్దాం అని అనటమేగాని ఎన్నాళ్ళు కలిసి వున్నా నీ అంతర్యం మాత్రం. నాకు అంతుచిక్కడం లేదుకదా! ఇప్పుడు నీతో రోడ్డుమీద వాదించలేను. కాలేజీవేళ అయింది. రేపటెల్లుండిలోగా ఈ విషయం తేల్చుకో, అందాకా విడిచిపెట్టను. రేపు ఉదయం నీ గదిలో ఉండు, వస్తాను." అని చెప్పి సురేష్ గబగబా కాలేజీకి సాగిపోయాడు. పక్షం గడిచిపోయింది. మహిమబాబు ఎక్కడున్నాడు? అతడు మెడికల్ కాలేజీలో చేరటం ఏమయింది? ఒక ఆదివారంనాడు రెండు ఝాములప్పుడు సురేష్ అతనికోసం వెదకి వెదకి అలసిపోయి చిట్ట చివరకు కొందరు బీదవిద్యార్ధుల వసతి గృహానికి చేరుకున్నాడు. తిన్నగా పైకి వెళ్ళి చూశాడు. అదొక చిన్నగది. వెలుగుకిరణమైనా లోపలికొచ్చే ఆస్కారం ఎక్కడాలేదు. చినిగిపోయిన పాత దర్భాసనాలు పరుచుకొని ఏడెనిమిది మంది విద్యార్థులు భోజనం చేస్తున్నారు. మహిమబాబు తలెత్తి మిత్రుని చూశాడు. "అకస్మాత్తుగా గది ఖాళీచేయవలసి వచ్చింది. అందుచేత నీకు కబురు తెలుపలేకపోయాను. అయినా నువ్వు ఎలా పసిగట్ట గలిగావు చెప్పుమీ" అన్నాడు. సురేష్ ఆ మాటలకేమీ జవాబు చెప్పలేదు. అక్కడ గడపమీద కూచుని వాళ్ళు "భోజనం చేయటం" చూస్తున్నాడు. నాటు బియ్యపు అన్నము. నీళ్ళు నీళ్ళుగా వుంది పప్పు, చౌకబారు కూర ఏదో ఒకటి వండారు. పెరుగులేదు. పాలులేవు, పిండివంట అసలే లేదు