VOL 8 -DR.DASARATHI RANGACHARYA RACHANALU - AKSHARAMANDAKINI by DR.DASARADHI RANGACHARYA Telugu book cover

VOL 8 -DR.DASARATHI RANGACHARYA RACHANALU - AKSHARAMANDAKINI

by DR.DASARADHI RANGACHARYA

₹200
In stock · 23 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1. వేదనాదం 1. ఋగ్వేద దర్శనము ఓం నమోవేద పురుషాయ హృదయం దక్షిణంచాక్షి మండలందాధిరుహ్యయః॥ చేష్టతే తమహం నౌమి ఋగ్యజుస్సామ విగ్రహం॥ కేవలం భగవదనుగ్రహం వలన శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత రచన పూర్తి చేయగలిగాను. భగవదనుగ్రహం లేక ఏ కార్యమూ ప్రారంభమూకాదు పూర్తికాదు. ఎందుచేతననగా, సర్వకర్మలు ధీకార్యాలు భగవదదీనములు. ఈ సమస్త భువనమండలం నిరాధారంగా నిలిచి ఉన్నదంటే అందుకు భగవదాజ్ఞయే కారణం. భూమి, సూర్యచంద్రాదులు సమస్త చరాచర ప్రకృతి భగవదాజ్ఞవల్లనే ప్రవర్తిల్లుతున్నాయి. భగవంతుడు నియమించినరీతిగా తమ విధులను నిర్వర్తిస్తున్నాయి. పురుష ఏవేదగం సర్వంయ ద్భూతం యచ్ఛభవ్యం ఉతామృతత్వ స్యేశానోయదన్నే నాతి రోహతి. - ఋగ్వేదం 10-4-90-2. వేదం హిమవదున్నతం. ఆకాశమంతటి విశాలం. సముద్రమంతటి గంభీరం. వాయువువలె సర్వవ్యాప్తం. వేదం అంతటిది. నేను ఇంతటివాణ్ణి! నేనేమిటి, వేదాన్ని గురించి ఆలోచించడం ఏమిటి? వేదం పఠించడం ఏమిటి? వేదం వ్రాయడం ఏమిటి? ఇది కేవలం భగవదనుగ్రహం కాకుంటే మరేమిటి? ప్రతి ప్రాణికీ అంతో ఇంతో శక్తి ఉంటుంది. అదీ భగవంతుడు ప్రసాదించిందే! ఆ శక్తివరకు పనులు చేసుకుంటే ఆ ప్రాణిశక్తి అనుకుంటే అనుకోవచ్చు. చెప్పుకున్నా చెప్పుకోవచ్చు. కాని శక్తినిమించిన పనిచేసిందంటే? చీమ కొండను కదిలించిందంటే! ఉడుత సముద్రం పీల్చేసిందంటే? గరుడుడు సూర్యుణ్ణి మింగేశాడంటే? ఇవన్నీ కేవలం భగవదనుగ్రహంవల్ల జరిగాయని అనుకోక తప్పదు. డా॥ దాశరథి రంగాచార్య రచనలు-8 - అక్షర మందాకిని