VOL 8-DR.VASIREDDY SEETHADEVI SAHITHYAM-NAVALALU - NINGI NUNDI NELAKU by DR.VASIREDDY SEETHADEVI Telugu book cover

VOL 8-DR.VASIREDDY SEETHADEVI SAHITHYAM-NAVALALU - NINGI NUNDI NELAKU

by DR.VASIREDDY SEETHADEVI

₹140
In stock · 165 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
నింగి నుండి నేలకు “నిన్ను చూసేదాకా తెలియదు నాలో మనసుందని నిన్ను తాకే దాకా తెలియదు నాలో వలపుందని నిన్ను.. నిన్ను.... తల బద్దలు కొట్టుకున్నా అపైన మాటలు తట్టడం లేదు కల్పనకు విసుగ్గా కాగితాల మీద పేపర్ వైట్ పెట్టింది. పెన్కు కేప్ పెట్టింది. తలెత్తి గడియారం కేసి చూసింది. పదీ ఇరవయ్ అయింది. వాకిట్లో అలికిడి అయి, తలెత్తి చూసింది సిద్ధార్థ లోపలకు వచ్చాడు. "ఇంత ఆలస్యం అయిందేం?" అందుకోవడానికి చెయ్యి చాచింది కల్పన. 'సిద్ధార్థ విప్పిన కోటును "సినిమాకు వెళ్ళాను" భార్యకు కోటు అందివ్వలేదు. హాంగర్కు తగిలించాడు. "ఎవరెవరు వెళ్ళారు?" “రాజేంద్రా, నేనూ, లీలా...” లీల ఎవరు?" "రాజేంద్ర పిన్ని కూతురు. బొంబాయినుంచి వచ్చింది. చాలా అందంగా ఉంటుంది" అంటూ భార్య ముఖంలోకి చూశాడు. అతను ఆశించిన మార్పు కల్పన ముఖంలో కన్పించలేదు. "డ్రింకు తీసుకుంటావా?" "తీసుకుంటాను." "ఏం తీసుకుంటావ్?" "నువ్వు రాసుకో! నేను తెచ్చుకుంటాలే!" సిద్ధార్థ లోపలకు వెళ్ళాడు. కల్పన కూడా అతని వెనకే వెళ్ళి ఫ్రిజ్ తెరిచింది. "స్కాచ్ తీసుకుంటావా?" అన్నది. "నువ్వెళ్ళి కవిత్వం రాసుకో! నాకు ఏం కావాలో నేను చూసుకోగలను" నిర్లిప్తంగా వుంది అతని కంఠం. కల్పన అదోలా నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళి పోయింది. సిద్ధార్థ బాటిల్, గ్లాసూ తీసుకొని వెళ్ళి కూర్చున్నాడు. కల్పన లేచి వెళ్ళి ఐస్ ముక్కలు ప్లేట్లో పెట్టి తెచ్చింది. "థాంక్యూ!" "తినడానికి ఏం తెమ్మంటావ్?" "ఏమీ అక్కర్లేదు" ముభావంగా అన్నాడు. కల్పన ఎదురుగా కూర్చుంది. "భోజనం చెయ్యవా?" "నువ్వు చేశావా?" "పదిగంటలదాకా నేను భోజనం చెయ్యకుండా నీ కోసం చూడనని తెలుసుగా!" సిద్ధార్థ్ చివ్వున తలెత్తి కల్పన ముఖంలోకి చూశాడు. "ఎల్లుండి మిస్టర్ సంపత్తు కూతురి పెళ్ళట. మిసెస్ సంపత్తు వచ్చి కార్డు ఇచ్చి వెళ్ళింది." "రాజేంద్రతో ఏం చెప్పావ్?" గ్లాసు చేతిలోకి తీసుకుంటూ అడిగాడు సిద్ధార్థ. డా॥ వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం-8 3 నింగి నుండి నేలకు