
VOL 9-SARATH SAHITHYAM PALLISAMAJ-VIRAJBAHU-PARINEETHA
₹150
In stock · 102 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
పల్లీ సమాజ్ వేణీఘోషాల్ ముఖర్జీలవారి పెరట్లో అడుగెడుతూనే, ఎదురుగా కన్పించిన ఓ ప్రౌఢస్త్రీని “అత్తా! రమ ఎక్కడున్నది?" అని అడిగాడు. జపం చేసుకుంటూ కూర్చున్న ఆమె వంట ఇంటికేసి, 'అక్కడ' అన్నట్లు వేలితో చూపించింది. వేణీ వంటయింటి గుమ్మం దగ్గరకు వచ్చి నుంచుని "అయితే ఇంతకీ ఏమని నిశ్చయించుకున్నట్లు రమా?" అని అడిగాడు. మండుతున్న పొయ్యిమీదనుంచి చిటపట లాడుతున్న బాణలి కిందకి దించి "ఏ విషయం వేణీదా?" అని అడిగింది రమ. "తారిణీ బాబాయ్ శ్రాద్ధం విషయం రమా! రమేశ్ నిన్ననే వచ్చాడిక్కడికి. తండ్రి శ్రాద్ధం చాలా భారీగా చేయాలని చూస్తున్నాట్ట. వెళతావా మరి నువ్వు?" రమ ఆశ్చర్యంతో కళ్ళు ఇంతచేసుకుని, "తారిణీ ఘోషాల్ ఇంటికి వెళతానా నేను?" అంది. వేణీ కొంచెం తటపటాయిస్తూ "నాకా సంగతి తెలుసు రమా! ఏమయినా నువ్వు వాళ్ళఇంటికి వెళ్ళవని తెలుసు నాకు. అయినా ఇంటింటికీ వాడు స్వయంగా వెళ్ళి పిలిచి వస్తున్నాట్ట! ఇలాంటి వంకర బుద్ధుల్లో మాత్రం వాడు తండ్రికన్నా మించినవాడు. ఒకవేళ మరి ఇక్కడికి కూడా వస్తే సమాధానం ఏమని చెబుతావ్?" అని అడిగాడు. రమ కొంచెం అభిమానం తెచ్చుకుని “నేనేమీ చెప్పను. బైట దర్వానే చెప్పి పంపుతాడు సమాధానం" అంది. జపంలో కూర్చునివున్న రమ పింతల్లి వివాదగ్రస్తమూ, అతి రుచికరమూ అయిన ఈ సంభాషణ చెవిని పడగానే ఆ జపం అక్కడితో వదిలేసి లేచి చక్కావచ్చి రమ అంటున్న మాట ఇంకా పూర్తికాకుండానే రుసరుసలాడుతూ, “దర్వాన్కూడా యెందుకు? నాకేం చెప్పటం చేతకాదనా? అతగాడికి ఎలా చెబుతానో తెలుసా?