
MAHAPRASTHANAM
by SRI SRI
₹100
In stock · 3133 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం” అని ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీశ్రీ 1910 ఏప్రిల్ 30న విశాఖపట్టణంలో జన్మించారు. 1931లో బి.ఏ. పూర్తి చేసిన శ్రీశ్రీ ఎ.వి.యన్. కాలేజీలో డిమాన్‌స్ట్రేటర్‌గా, మద్రాసు ఆంధ్రప్రభలో లేబర్ ఎడిటర్ అసిస్టెంటుగా వివిధ ఉద్యోగాలు చేసినా, తన సొంత భావాల కారణంగా దేనిలోనూ ఇమడలేక సినీరంగంలో స్థిరపడ్డారు. తెలుగు కవిత్వాన్ని మరో మలుపు తిప్పిన మహాకవి శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ 1950లో పుస్తక రూపం దాల్చింది. 1955లో అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగా వ్యవహరించారు. అయన సాహితీ తపస్సుకు గుర్తింపుగా ‘ఖడ్గసృష్టి’ కావ్యానికి 1966లో సోవియట్ భూమి నెహ్రూ అవార్డు, 1973లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1979లో శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ వారి మొదటి అవార్డు అందుకున్నారు. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీపించి, ఊగించి, శాసించి, రక్తికట్టించిన మహాకవి శ్రీశ్రీ 1983 జూన్ 15న మహాప్రస్థానమయ్యారు.