VRUKSHA VILAPAMU by PARDHA SARADHI Telugu book cover

VRUKSHA VILAPAMU

by PARDHA SARADHI

₹150
In stock · 11 available
PublisherPARDHA SARADHI
LanguageTelugu
ముందుగా మీతో ఒక మాట :- వృక్షజాలాలు ప్రబలమైన జీవరాశిగా ఏర్పడిన ఒక సంకీర్ణ పర్యావరణ సంవిధానం అడవి. ప్రకృతిలో జీవము, జీవాధారము, వృక్ష పశు పక్షి మత్యాదుల నావారూప జీవవైవిధ్య భరితమూ అయినది- "సంకీర్ణ పర్యావరణ సంవిధానం”. అట్టి సంకీర్ణ వ్యవస్థలో ప్రబల జీవరాశిగాగల చెట్లు నిరంతరం జీవసమున్నతికి కోప్పడుతూ మట్టి నుండి మధుర రసాలను ఔషదాలను తీసి మనకందిస్తున్నాయి. జీవజాలాల మనుగడ కోసం వాతావస్థితిని ద్యోతకంచేసి మంటిని మింటినీ పరిసరాలను మంచిగా ప్రభావితం చేస్తూ మానవునికి కావలసిన వైభవాలన్నిటినీ సమకూరుస్తున్నాయి. అమ్మనాన్నల వలె ఆధరణను తప్ప యితరమేదీ ఎదురు ఆశించని భూమ్మీది దేవతలు చెట్లు నేను జీవానంద మానవతామూర్తులతో మమేకమై పొందిన గమకాలతో బాటు పర్యావరణ పటిష్ఠతలో ప్రాచీనకాలం నుండి అడవుల ప్రాధాన్యత, క్రమానుగత చరిత్ర వృక్ష వైశిష్టుము పశు పక్షి మత్పాదుల ప్రభావము మరియు ప్రస్తుతపు వాటి హృదయ విదారకపు పరిస్థితులనిందు ప్రజల కనుదెరవుచేశాను. వృక్ష జంతు జాలాలను "కసాయితనం"తో తప్ప "పర్యావరణ దృష్టి” తో ఎవరూ చూడటం లేదనేదే నా ఆవేధన తెలియని వారికి అవగాహన జేసి యాజమాన్యం వహించి కాపాడటానికి జీతబత్యాలు నిధులు సకల సౌకర్యాలూ పొందుతున్న వారే కామాంధులై విచక్షణారహితంగా పచ్చదనాన్ని కాటేస్తున్న ప్రత్యక్ష సాక్ష్యాలు ఈ పుస్తకాన్ని దాసి మీముందుంచడానికి నాలో ఒత్తిడిని పెంచాయి. ఆదిలో వృక్షజాతుల సంఖ్య ఇరవై (20) లక్షలు, పక్షిజాతులు పది(10), మృగజాతులు ముప్పై(30), చేపజాతులు తొమ్మిది(9), క్రిమికీటకాదులు పదకొండు (11) మానవజాతులు నాలుగు (4) లక్షలు వెరసి ఎనబైనాలుగు (84) లక్షల జీవరాశు లతోకలిసి పుడమి సస్యశ్యామలంగా ఉండేదని "తారకామృత సారం" చెబుతున్నది. ప్రస్తుతం అవన్నీ చాలావరకూ అంతరించిపోయాయి. వృక్షజాతుల సంఖ్య వందలకు చేరింది. మన పరిసరాల్లోని జాతులను వేళ్ళతో లెక్కించవచ్చు. ప్రస్తుతం సగటున నిజమైన సంపుష్టికరమైన అడవులభాగం. ఐదు(5)శాతం కన్నా చాలా దిగువకు తరిగిపోయి ఉందనేది ఒక బయంకరమైనసత్యం. వృక్ష విలాపము - ఫారెస్టరు దగ్గుపాటి పార్థసారథి నాయుడు