
VRUTHI
₹50
In stock · 402 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
యిన వృత్తి ◆నవల ◆ ప్రియుడి స్పర్శతో సిగ్గుల మొగ్గయిన ప్రియురాలి చెంపల్లా తూరుపు కందిపోయి వుంది. జతగాడి కళ్లల్లో భావాలు చదవాలని... బరువుగా, అతి మెల్లగా విచ్చుకొంటున్న ప్రియురాలి అరమోడ్పు కనురెప్పలా, ఉదయిస్తున్న సూరీడు ముగ్ధమనోహరంగా ఉన్నాడు. అరమోడ్పు కనులపై అందంగా జీరాడుతున్న కురుల్లా సూరీడుపై వంగిన కొబ్బరి ఆకు ఈనేల మెత్తని కదలిక సన్నని సంగీతంలా వినిపిస్తుంది. ఆ అద్భుత దృశ్యంలోంచి జాలువారిన లేలేత కిరణాలుపడి, ఆ వీధిలోంచి రెండంతస్థుల భవనం నుదుటి మీద కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న 'తులసీ నర్సింగ్హామ్' అనే అక్షరాలు వింతకాంతిని సంతరించుకొన్నై, "డాక్టర్! నన్ను చంపెయ్యండి. నేనింక ఈ బాధ భరించలేను. దయచేసి నన్ను చంపెయ్యండి!" ఆ చల్లని ఆహ్లాద వాతావరణానికి అతీతంగా వున్న కాన్పుల గదిలో ఉండుండి పేషెంట్ పెడుతున్న కేకలు డాక్టర్ భవ్యని కదిలిస్తున్నై. చేతులెత్తి నమస్కరిస్తూ ఒక గంటగా భవ్యను దీనంగా ప్రార్థిస్తోందామె. బాధని భరించి వడలిపోయిన ఆ మొహాన్ని చూస్తూనే కళ్ళు చెమ్మగిల్లి ఆ అమ్మాయి కాళ్ళదగ్గరనుంచి తల దగ్గరకు చటుక్కున చేరింది. “తప్పమ్మా! అలా మాట్లాడితే ఎలా? కాసేపట్లో నీకీ బాధ తగ్గిపోతుంది. ధైర్యంగా ఉండు" అంది అనునయంగా. "డాక్టర్! నేను ఓ... ర్చు... కోలేక... పోతున్నాను. ఈ నొప్పిని పో...గొ... ట్టండి" అంటూ మళ్ళీ చేతులెత్తి ప్రార్థించడానికి ప్రయత్నించింది. నీరసంవల్ల సగం లేచిన చేతులు క్రిందికి జారిపోయాయి. ఎక్కడో నూతిలోంచి వస్తున్నట్లున్న గొంతు మళ్ళీ నొప్పి రావడంతో పూడుకుపోయింది. ఆమె పడుతున్న బాధ ఎంత తీవ్రమైందో బిగుసుకుపోతున్న ఆమె మొహం చెబుతుంది! గిలగిలలాడుతున్న ఆమెను తల్లిలా గుండెలకు హత్తుకోవాలనిపించింది భవ్యకి. సృష్టి ఎంత కఠినమైంది? జన్మనిచ్చే తల్లిని మృత్యువు పొలిమేరల దాకా తీసుకెళ్ళి తను ఊపిరిపోసుకుంటుంది.